2020లో కూడా ఆ పాటకే ఎక్కువ లాభాలు.. న్యూ రికార్డ్
ఒకప్పుడు సినిమా విడుదల అవుతోంది అంటే ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మారేది. అయితే ఈ రోజుల్లో మాత్రం సినిమాకు హైప్ పెరగాలి అంటే ఒకే ఒక్క పాట చాలు. సినిమా రిజల్ట్ ఏమిటనేది పక్కన పెడితే సాంగ్ ఒక్కటి క్లిక్కయ్యిందో సినిమాకు ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోతాయని చెప్పవచ్చు. ఇక గత ఏడాది లోనే కాకుండా ఈ ఏడాది కూడా యూ ట్యూబ్ లో ఒక సరికొత్త రికార్డును అందుకున్న సాంగ్ రౌడి బేబీ.
సౌంత్ ఇండియాలోనే 1 బిలియన్ వ్యూవ్స్ అందుకున్న తొలి పాటగా ఇది రికార్డుకెక్కింది. మారీ 2 సినిమాలోని ఆ పాట గత ఏడాది యూ ట్యూబ్ లో ట్రెండ్ అయ్యింది. ఇక ఈ ఏడాది కూడా 1 బిలియన్ వ్యూవ్స్ అందుకోవడంతో హాట్ టాపిక్ గా నిలిచింది. 2020లో ఇదొక స్పెషల్ రికార్డ్ అని చెప్పవచ్చు. అలాగే యూ ట్యూబ్ లో ఎక్కువగా ఆదాయం అందించిన సినిమా కూడా ఇదేనట.

ధనుష్, సాయి పల్లవి కాంబినేషన్ అలాగే ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా చేయడం మేజర్ ప్లస్ పాయింట్స్. ఇక ధనుష్, దీక్షిత ఈ పాటను పాడగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ సినిమాలోని సాంగ్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా రికార్డ్ క్రియేట్ చేసింది. బాలాజీ మోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ దర్శకుడు మరోసారి సాయి పల్లవి, ధనుష్ కాంబినేషన్ లో మరో సినిమా చేయనున్నట్లు అప్పట్లో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. మరి ఆ సినిమా ఎప్పుడు వస్తుందో..
goodbye 2020 mahesh babu sai pallavi tollywood virataparvam garikapati narasimha rao సాయి పల్లవి విరాట పర్వం ప్రియమణి టాలీవుడ్


Click it and Unblock the Notifications