నా టాపిక్ తీస్తే .. ఆ హీరోయిన్‌తో మీ మేటర్ బయటపెడతా.. హీరోకి శ్రీలీల వార్నింగ్

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రీలీల అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలకు ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది శ్రీలీల. వరుస ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. నటనపరంగా ఈ స్థాయి పాత్రలు దక్కనప్పటికీ డ్యాన్స్‌లు, గ్లామర్ షో విషయంలో మాత్రం శ్రీలీలకు తిరుగులేదని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు.

ఫ్లాపుల్లోనూ తగ్గని క్రేజ్
హిట్ వెంట పరుగులు తీసే చిత్ర పరిశ్రమలో ఫెయిల్యూర్స్ వస్తున్నా నిలదొక్కుకోవడం, స్టార్‌డమ్‌ను సంపాదించడం అంత తేలికైన విషయం కాదు. నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాప్‌లే అందుకున్నారు శ్రీలీల. అయినప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. డేట్స్ సర్దుబాటు చేయలేక కొన్ని ప్రాజెక్ట్స్ నుంచి కూడా శ్రీలీల తప్పుకున్నారు. అఖిల్ సరసన నటించాల్సిన లెనిన్ మూవీ నుంచి శ్రీలీల వైదొలగడం ఇండస్ట్రీలో షాక్‌గా మారింది. వరుస ఫ్లాపులతో ఉన్నప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు శ్రీలీల. పారితోషికాన్ని డబుల్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. సినిమాకు ఏకంగా 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తోందట.

Sreeleela warns Jagapathi Babu in Jayammu Nischayammu Raa Talk show

శ్రీలీల డైరీ ఫుల్
ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ మహారాజా రవితేజ సరసన మాస్ జాతరతో పాటు తమిళంలో పరాశక్తి, హిందీలో ఆషికీ 3లో శ్రీలీల నటిస్తున్నారు. తన కెరీర్‌లో తొలిసారిగా బాలీవుడ్ సినిమాలో నటించిన ఆమె త్వరలోనే ఈ సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తుండగా.. అతనితో శ్రీలీల క్లోజ్‌గా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ రెస్టారెంట్స్, ఇతర ఈవెంట్స్‌కు కలిసి వెళ్తుండటం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది.

బుల్లితెరపై జగపతిబాబు ఎంట్రీ
ఇదిలాఉండగా.. సీనియర్ హీరోలు, హీరోయిన్లంతా ఒకరి తర్వాత మరొకరు బుల్లితెరపై అడుగుపెడుతున్నారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే కార్యక్రమంతో ప్రేక్షకులను పలకరించారు. తాజాగా మరో సీనియర్ నటుడు జగపతి బాబు కూడా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. జీ తెలుగు ఛానెల్‌లో జయమ్ము నిశ్చయమ్ము పేరుతో ఓ టాక్‌ షోను జగ్గూభాయ్ హోస్ట్ చేస్తున్నారు. తొలి ఎపిసోడ్‌కు కింగ్ అక్కినేని నాగార్జున, అతని సోదరి నాగ సుశీల హాజరై కొత్త సంగతులు తెలియజేశారు. తాజాగా నెక్ట్స్ ఎపిసోడ్‌కు శ్రీలీల గెస్ట్‌గా వచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమోను జీ తెలుగు విడుదల చేసింది.

నా మేటర్ తీయొద్దు
మేమందరం ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ నేర్చుకున్నాం.. నువ్వు యాక్టింగ్ నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చావని జగపతిబాబు చెప్పగా.. మీరు నన్ను తిట్టారా? పొగిడారా? అని శ్రీలీల పంచ్ వేసింది. శ్రీలీల అని పిలవాలా? ఏమని పిలవాలా? అని జగపతి బాబు ప్రశ్నించగా.. ఎలా అనుకూలంగా ఉంటే అలా పిలవమని చెప్పింది శ్రీలీల. చాలా లీలలు ఉన్నాయని జగపతిబాబు పంచ్ విసరడంతో ఆమె దండం పెట్టేసింది. గుంటూరు కారం సినిమా చేసేటప్పుడు లెఫ్ట్‌లోనో, రైట్‌లోనో ఫేస్‌లో కొంచెం తేడా ఉండేదని జగపతిబాబు చెప్పాడు. ఆ టాపిక్ తీసుకొస్తే నేను మళ్లీ మీ టాపిక్ తీసుకొస్తానని అంటుంది శ్రీలీల. దాంతో షాకైన జగపతి బాబు ఏ టాపిక్ అని అడుగుతాడు.

శ్రీలీలకు సర్‌ప్రైజ్
మీ హీరోయిన్ గారు.. మీరు ఒకరు అని హింట్‌తో వార్నింగ్ ఇచ్చింది శ్రీలీల. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టేశావని జగపతిబాబు కాంప్లిమెంట్ ఇవ్వగా.. ధూల తీరిపోతుందని శ్రీలీల చెప్పింది. ఇంతలో శ్రీలీల తల్లిని వేదికపైకి తీసుకొచ్చి సర్‌ప్రైజ్ చేశారు జగపతి. మీరు హీరోయిన్ అవ్వాలని అనుకుని, మీ అమ్మాయిని హీరోయిన్‌ని చేశారా అని శ్రీలీల తల్లిని ప్రశ్నించాడు జగపతిబాబు. అన్నింటి కంటే నేను మీకు పెద్ద ఫ్యాన్‌ అని ఆమె తెలిపారు. ఇంకా చాలా ఉన్నాయ్ వెయిట్ చేయమంటూ ప్రోమోను ముగించారు. మరి శ్రీలీల ఎలాంటి విషయాలు పంచుకున్నారు? జగపతిబాబు ఎలాంటి ప్రశ్నలు వేశారు? తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X