Samantha, Naga Chaitanya breakup: వాళ్లిద్దరూ అంటూ.. శ్రీరెడ్డి హాట్ కామెంట్స్!

దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ కపుల్స్ సమంత, నాగచైతన్య అక్కినేని దాంపత్య జీవితంలో కలతలు చోటుచేసుకొన్నాయని, వారిద్దరూ విడిపోవడానికి నిశ్చయించుకొన్నారనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే వారిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉందో గానీ, సోషల్ మీడియాలో మాత్రం వారి గురించి కామెంట్లకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా సమంత, చైతు రిలేషన్ గురించి వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది. ఈ క్రమంలో శ్రీ రెడ్డి చేసిన కామెంట్లు ఏమిటంటే...

సమంత, చైతు విడిపోయారంటూ..

సమంత, చైతు విడిపోయారంటూ..

గత కొద్ది రోజులుగా నాగచైతన్య అక్కినేని, సమంత విడిపోయారనే వార్త వైరల్ అవుతున్నది. అందుకు సమంత తన సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరు నుంచి అక్కినేని అనే పేరు తొలగించడమే కారణమైంది. దాంతో వారిద్దరూ విడిపోయారనే వార్తకు బలం చేకూరేలా కొందరు కామెంట్లు చేయడం గమనార్హం.

చైతు ట్వీట్‌కు సమంత రిప్లై

చైతు ట్వీట్‌కు సమంత రిప్లై

ఇలాంటి వార్తల నేపథ్యంలో తాను నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ రిలీజ్, ట్రైలర్ లింకును షేర్ చేసి నాగచైతన్య ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు సమంత రిప్లై ఇస్తూ.. విన్నర్.. లవ్ స్టోరి సినిమా యూనిట్‌కు, సాయిపల్లవికి బెస్టాఫ్ లక్ అంటూ ట్వీట్‌ చేశారు. దాంతో అభిమానుల్లో రకరకాల కామెంట్లు పెట్టారు.

సమంతకు థ్యాంక్స్ చెప్పిన చైతూ

సమంతకు థ్యాంక్స్ చెప్పిన చైతూ

అయితే తన ట్వీట్‌పై సమంత స్పందించడంపై నాగచైతన్య రియాక్ట్ అయ్యారు. తనకు, సాయిపల్లవికి, చిత్ర యూనిట్‌కు విషెస్ తెలియచేసినందుకు చైతూ హ్యపీగా ఫీలయ్యారు. అంతేకాకుండా థ్యాంక్యూ సామ్ అంటూ నాగచైతన్య రిప్లై ఇచ్చారు. దాంతో వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా? లేవా అనేది సందిగ్ధంలో పడేశాయి.

సమంత, చైతూ మధ్యలో శ్రీరెడ్డి

సమంత, చైతూ మధ్యలో శ్రీరెడ్డి

ఇక సమంత, నాగచైతన్య ట్విట్టర్ వేదికగా ఒకరికొకరు పలకరించుకోవడం, అలాగే థ్యాంక్స్ చెప్పుకోవడం జరుగుతుంటే మధ్యలో నటి శ్రీరెడ్డి ఎంట్రీ అయ్యారు. వారిద్దరి బ్రేకప్‌పై ఘాటుగా స్పందించారు. నాగచైతన్య, సమంత దంపతులకు సానుకూలమైన ట్వీట్ చేసింది. సమంత, నాగచైతన్యను ట్యాగ్ చేస్తూ లవ్ స్టోరీ ట్రైలర్ గురించి ట్వీట్ చేసింది.

సమంత, నాగచైతన్యపై రూమర్లు వద్దు

సమంత, నాగచైతన్యపై రూమర్లు వద్దు

సినిమా పరిశ్రమలో సమంత, నాగచైతన్య అక్కినేని బెస్ట్ కపుల్. వాళ్లిద్దరూ చాలా స్వీట్ అండ్ క్యూట్‌గా ఉంటారు. అలాంటి దంపతుల జీవితంపై తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు. వారి బ్రేకప్ గురించి రూమర్లు వ్యాప్తి చేయవద్దు అంటూ శ్రీరెడ్డి ట్వీట్ చేశారు. అయితే సమంత, చైతు గురించి కామెంట్ చేసిన శ్రీరెడ్డిని ఓ నెటిజన్ నీవు ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతావు అంటూ ప్రశ్నించడం గమనార్హం.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
ఫ్యాన్స్‌లో హుషారు పుట్టించిన నాగ చైతన్య

ఫ్యాన్స్‌లో హుషారు పుట్టించిన నాగ చైతన్య

ఇక నాగచైతన్య, సాయిపల్లవి నటించిన లవ్ స్టోరి చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానున్నది. పలు మార్లు వాయిదా పడిన తర్వాత సెప్టెంబర్ 24వ తేదీన రిలీజ్ చేయడానికి నిర్మాతలు నిర్ణయం తీసుకొన్నారు. ఈ సినిమాను థియేటర్లలో చూద్దాం అంటూ నాగచైతన్య ట్వీట్ చేసి ఫ్యాన్స్‌లో హుషారు పుట్టించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X