‘ప్రెగ్నెంట్ కావడం నాకిష్టం లేదు.. పిల్లల కోసం నా భర్తను ఒప్పించి ఆమెతో’

మాతృత్వం అనేది ఆడదానికి దేవుడిచ్చిన వరం. తల్లి కావడంతోనే స్త్రీ జన్మకు అసలు సిసలు సార్ధకత వస్తుందని పెద్దలు అంటారు. ఓ 50 ఏళ్లు వెనక్కి వెళితే.. ప్రతి ఇంట్లో కనీసం డజను మంది పిల్లలతో కళకళలాడేవి. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. చాలా దేశాలతో పాటు మనదేశంలోనూ సంతాన సాఫల్యత దారుణంగా పడిపోతోంది. దీనికి తోడు చాలా మంది పెళ్లిళ్లు చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఒకవేళ చేసుకున్నా పిల్లల్ని కనడానికి 100 లెక్కలు వేసుకుంటున్నారు. మరికొందరికి పిల్లల్ని కనాలని ఉన్నా.. అందం దెబ్బ తింటుందని, వీక్‌గా మారిపోతామనే భయంతో పిల్లల్ని కనడం లేదు.

పిల్లల కోసం బాధపడ్డ సన్నీలియోన్
సెలబ్రెటీలు ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న మహిళలు ప్రెగ్నెన్సీ గురించి భయపడుతున్నారు. గర్భం దాలిస్తే తమ కెరీర్ ఏమవుతుందోనని వారి బెంగ. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్. తనుకు పిల్లల్ని కనాలని ఉన్నా.. కడుపులో బిడ్డల్ని మోయడం ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీలియోన్ పిల్లల కోసం ఎంత బాధపడింది వివరిస్తూ ఎమోషనల్ అయ్యింది. ఈ వివరాల్లోకి వెళితే..

Sunny Leone reveals why she choose IVF and surrogacy

భారత మూలాలున్న మహిళ
విదేశాల్లో పోర్న్ చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో అడుగుపెట్టింది సన్నీలియోన్. కెనడాలో స్థిరపడిన పంజాబీ తల్లిదండ్రులకు జన్మించారు సన్నీలియోన్. ఆమె అసలు పేరు కరణ్‌జిత్ కౌర్ వోహ్రా. చిన్నప్పటి నుంచి టామ్‌బాయ్‌లా పెరిగిన సన్నీలియోన్.. పోర్న్‌స్టార్‌గా మారారు. 2012లో జిస్మ్‌ 2 ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టి తన భారీ అందాలతో కుర్రకారులో సెగలు రేపారు సన్నీలియోన్. అక్కడి నుంచి ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. జాక్‌‌పాట్, రాగిని ఎంఎంఎస్ 2, హేట్‌స్టోరీ 2 తదితర చిత్రాలతో బాలీవుడ్‌లో సన్నీలియోన్ జెండా పాతారు.

తెలుగులోనూ సందడి
కరెంట్ తీగ, పీఎస్‌వీ గరుడ వేగ, జిన్నా తదితర చిత్రాలతో తెలుగు వారిని కూడా పలకరించారు సన్నీలియోన్. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, నేపాలి, బంగ్లా, మరాఠీ, ఇంగ్లీష్ భాషలలో ఆమె నటించారు. సన్నీలియోన్ అనగానే గ్లామర్ రోల్స్, స్కిన్ షో మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఆమె మనసు అంతకన్నా అందమైనది. ఎన్నో స్వచ్ఛంద సంస్థల్లో సన్నీలియోన్‌కు సభ్యత్వం ఉంది. తన సంపాదనలో చాలా భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ముంబైలోని మురికివాడలో 300 మంది పిల్లలు చదువుతున్న బడిని సన్నీ దత్తత తీసుకున్నారు.

భర్తే మేనేజర్
2011లో డానియెల్ వాబర్‌ని పెళ్లాడారు సన్నీలియోన్. భార్య షెడ్యూల్స్, కాల్షీట్లు, ఇతర వ్యవహారాలన్నీ వాబరే చూసుకుంటారు. తనపై ఎన్ని విమర్శలొచ్చినా, వివాదాలు సృష్టించినా తట్టుకుని నిలబడింది. బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ హోస్ట్ చేస్తోన్న పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సన్నీలియోన్.. తన కెరీర్, పెగ్నెన్సీ, పిల్లల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. తొలి నుంచి సన్నీలియోన్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. అయితే గర్భం దాల్చి కడుపులో పిల్లల్ని మోయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని.. అందుకే పలుమార్లు ఐవీఎఫ్‌కు వెళ్లి ఫెయిల్ అయినట్లు తెలిపింది.

Take a Poll

ఆమెకు చాలా డబ్బులిచ్చాం
మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన చిన్నారిని దత్తత తీసుకున్నట్లు తెలిపింది. ఐవీఎఫ్ ఫెయిలైన వెంటనే దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నామని.. అలాగే సరోగసి ద్వారా ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చినట్లు సన్నీలియోన్ పేర్కొన్నారు. సరోగసి కోసం ఎంచుకున్న మహిళను తాను, తన భర్త ఎంతో గౌరవంగా చూసుకున్నామని, ఎంతో డబ్బు ఖర్చు చేశామని, చివరికి ఆమె భర్తకు కూడా డబ్బులు చెల్లించామని వెల్లడించింది. మేం ఇచ్చిన డబ్బుతో ఆవిడ మంచి ఇల్లు కొనుక్కుని జీవితాన్ని హాయిగా గడుపుతున్నారని సన్నీలియోన్ పేర్కొన్నారు.

More from Filmibeat

Read more about: sunny leone bollywood news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X