ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన సుస్మితా సేన్: 45 ఏళ్ల వయసులో మరీ ఇంత దారుణంగానా!

ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత ఎంతటి వాళ్లైనా దీనికి తగిన సమయాన్ని కేటాయిస్తున్నారు. మరీ ముఖ్యంగా సినీ రంగానికి చెందిన సెలెబ్రిటీలు సోషల్ మీడియాల ద్వారానే ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండడంతో పాటు తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. అదే సమయంలో పర్సనల్ విషయాలనూ షేర్ చేసుకుంటున్నారు. మరికొందరైతే మూవీలు చేయకున్నా.. ఇలా ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. ఈ జాబితాలోకే వస్తుంది మాజీ మిస్ యూనివర్శ్ సుస్మితా సేన్. చాలా కాలం క్రితమే తన అందంతో మైమరపించిన ఈ భామ.. సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫొటోలనూ వదలుతూనే ఉంది. ఇప్పుడు 45 ఏళ్ల వయసులోనూ అందాల విందు చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసి షాకిచ్చింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

విశ్వ సుందరిగా ఎంపిక.. భారీ పాపులారిటీ

విశ్వ సుందరిగా ఎంపిక.. భారీ పాపులారిటీ

చదువుకునే రోజుల్లోనే మోడల్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది సుస్మితా సేన్. ఆ రంగంలో తన అందచందాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆమె.. ఆ తర్వాత ఎన్నో పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ఇందులో భాగంగానే 1994లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. ఆ తర్వాత మిస్ యూనివర్శ్ పోటీలకు అర్హత సాధించడంతో పాటు అక్కడ కూడా గెలుపొందింది. ఫలితంగా విశ్వ సుందరి కిరీటాన్ని అందుకుంది. అప్పటి నుంచి సుస్మితా సేన్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుని సత్తా చాటింది. దీంతో ఆమె పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది.

 సినిమాలకు దూరమైన సుస్.. అలా చేస్తూ

సినిమాలకు దూరమైన సుస్.. అలా చేస్తూ

మిస్‌ యూనివర్శ్‌గా గెలిచిన తర్వాత సుస్మితా సేన్‌కు అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి అవకాశాలు వచ్చాయి. కానీ, ఆమె చాలా వాటిని రిజెక్ట్ చేసింది. అలా రెండేళ్లు గడిపిన తర్వాత 1996లో 'దస్తక్' అనే హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంటర్ అయింది. అందులో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది. ఈ క్రమంలోనే దాదాపు అందరు బడా హీరోలతోనూ కలిసి నటించింది. దీంతో స్టార్ హీరోయిన్‌గా అయిపోయింది. 2015లో వచ్చిన బెంగాల్ చిత్రం 'నిర్భాక్' తర్వాత సినిమాలకు దూరమైంది. కానీ, ఈ మధ్య ఓ సిరీస్‌లో నటించింది.

 ఆ హీరోలతో డేటింగ్.. తల్లైన సుస్మితా సేన్

ఆ హీరోలతో డేటింగ్.. తల్లైన సుస్మితా సేన్

హీరోయిన్‌గా రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో సుస్మితా సేన్‌ పర్సనల్ లైఫ్ విషయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా అప్పట్లో కొందరు హీరోలతో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. దీంతో తరచూ ఆమెపై ఏదో రకమైన వార్తలు వస్తూనే ఉండేవి. అయినప్పటికీ ఓర్పుగా వాటిని ఖండిస్తూనే వచ్చింది. అదే సమయంలో ఈ మాజీ మిస్ యూనివర్శ్ పెళ్లికి సైతం దూరమైంది. కానీ, తల్లి కావాలన్న కోరికతో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని చాలా ఏళ్లుగా పెంచుకుంటోంది. తద్వారా ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

15 ఏళ్ల చొన్నోడితో ప్రేమాయణం... హైలైట్

15 ఏళ్ల చొన్నోడితో ప్రేమాయణం... హైలైట్

45 ఏళ్లు వచ్చినా సుస్మితా సేన్ వివాహం చేసుకోలేదు. ఇన్నేళ్ల కెరీర్‌లో పబ్లిక్‌గా డేటింగ్ చేస్తున్నట్లు కూడా ఎప్పుడూ ప్రకటించలేదు. కానీ, కొన్నేళ్లుగా రొహమన్ షాల్ (30) అనే ఈ యువ మోడల్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తోంది. అంతేకాదు, ఏకంగా అతడిని తన ఇంట్లోనే ఉంచుకుంది. ఈ క్రమంలోనే తరచూ అతడి కలిసి రొమాన్స్ చేసిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే ఆ మధ్య తన పిల్లల ముందే బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్‌గా వర్కౌట్ చేస్తున్న పిక్స్‌ను షేర్ చేసింది. దీంతో ఈ అమ్మడిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి.

 పెళ్లికి ముందే బ్రేకప్... కానీ బ్రేక్ చేసేసింది

పెళ్లికి ముందే బ్రేకప్... కానీ బ్రేక్ చేసేసింది

సుస్మితా సేన్.. త్వరలోనే ప్రియుడు రొహమన్‌ను వివాహం చేసుకోనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. గత ఏడాది కరోనా భయం ఉండడంతో ఈ సంవత్సరం ఈ జంట అధికారికంగా ఒక్కటి కాబోతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియుడితో ఆమె బ్రేకప్ చెప్పేసిందని ఆ మధ్య కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏకంగా అతడికి ముద్దులు పెడుతూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో బ్రేకప్ అయిందన్న వార్తలకు పుల్‌స్టాప్ పడింది. మళ్లీ ఈ మధ్య అతడితో కలిసి రెచ్చిపోతూనే ఉందామె.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

చేతి నిండా సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, అవకాశాలు లేక ఖాళీగా ఉన్నా హాట్ హీరోయిన్ సుస్మితా సేన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఈ కారణంగానే సుస్మితా సేన్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీ స్థాయిలో పెరిగిపోతూనే ఉంది.

Recommended Video

Megaatar Chiranjeevi Daughter To Debut In Tamil Remake | సక్సెస్ అవుతుందా?
 హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన సుస్మితా సేన్

హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన సుస్మితా సేన్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సుస్మితా సేన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ దుస్తులతో ఘాటు ఫోజు ఇస్తూ కనిపించింది. తద్వారా ఈ హాట్ బ్యూటీ ఎద అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. తద్వారా ఆమె కుర్రకారు గుండెళ్లో గాయాలు చేసేలా రచ్చ చేస్తోంది. సుస్మితా సేన్ గ్లామర్ ట్రీట్ చేస్తోన్న ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా వీటికి లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. తద్వారా ఇవి ఇంటర్నెట్‌లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X