తెలుగు సినిమాతో బిజీ అయిన తాప్సి.. మరో డిఫరెంట్ మూవీ!

ఒకప్పుడు సొట్ట బుగ్గల అందంతో గ్లామరస్ బ్యూటీగా క్రేజ్ అందుకున్న తాప్సి పన్ను ఇప్పుడు మాత్రం టాలెంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటోంది. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా ఎంతో కొంత డిఫరెంట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక చాలా కాలం తరువాత అమ్మడు ఒక తెలుగు సినిమాతో బిజీగా మారింది.

ఒకప్పుడు తెలుగు సినిమాలతోనే బిజీగా కనిపించిన తాప్సి అనుకున్నంత స్థాయిలో అయితే హిట్స్ అందుకోలేదు. దీంతో లాభం లేదని ముంబైకి షిఫ్ట్ అయ్యింది. అక్కడే బాలీవుడ్ సినిమాలు చేసుకుంటూ ఒక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకుంటోంది. ఇప్పటికే రెమ్యునరేషన్ ను రెండు కోట్ల వరకు అందుకుంటున్నట్లు సమాచారం. అయితే అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు నచ్చితే తక్కువ పారితోషికం ఇచ్చినా కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

Taapsee Pannu new telugu movie after long gap

తాప్సి 'మిషన్ ఇంపాజిబుల్' అనే తెలుగు సినిమాకు ఒకే చెప్పినట్లు ఆ చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో మంచి హిట్ అందుకున్న స్వరూప్ RSJ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక చివరగా తాప్సి 2018లో నివెవరో అనే డైరెక్ట్ తెలుగు సినిమా చేసింది. అనంతరం గేమ్ ఓవర్ అనే సినిమాని తెలుగు తమిళ్ లో ఒకేసారి విడుదల చేశారు. ఇక ఇన్నాళ్లకు ఆమె చేస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X