అలా నేను తొలి సినిమా ఛాన్స్ కొట్టేశాను.. ఆ అనుభవాలు పంచుకొన్న తాప్సీ!
గ్లామర్ హీరోయిన్‌గా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తాప్పీ పన్ను తన టాలెంట్‌తో హీరోయిన్ ఓరియెంట్ సినిమాలతో అదరగొడుతున్నది. కెరీర్ ఆరంభంలో నిలదొక్కుకోవడానికి కష్టాలు పడిన ఈ అందాల సుందరి తన కష్టాలను మరోసారి వెల్లడించింది. బాలీవుడ్లో ప్రవేశించడానికి ముందే తెలుగులో మంచు మనోజ్, దర్శకుడు రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రంతో ఎంట్రీ ఇచ్ింది. అయితే హిందీలో చష్మే బద్దూర్ సినిమాకు ఆడిషన్ ఇవ్వకుండానే నేను సెలెక్ట్ అయ్యానంటూ వివరించింది.
నా కెరీర్ ఆరంభంలో నన్ను చూస్తే ప్రీతి జింటా గుర్తొచ్చేది. ఆ వైబ్స్ చూసి నాకు ఆఫర్ ఇచ్చారు. ఎలాంటి ఆడిషన్స్ లేకుండానే సినిమా ఛాన్స్ కొట్టేశాను. ఆడిషన్స్ ఇబ్బంది లేకుండానే ఆఫర్ దక్కినందుకు దేవుడికి థ్యాంక్స్ చెపుకొన్నాను అని తాప్సీ పన్ను వెల్లడించింది.

ఏడాదికి ఒక సినిమా చేయాలంటే నాకు ఇష్టం ఉండదు. నాకు విలాసవంతమైన జీవితం గడపాలంటే చాలా ఇష్టం. ఆరంభంలో అవకాశాలు దక్కక కెరీర్ ఒడిదుడుకులకు లోనైంది. కెరీర్ ప్రారంభంలో వచ్చే రోల్స్ రొటీన్‌గా ఉండేవి. దాంతో అలాంటి పాత్రలు చేయడానికి విసిగిపోయాను అంటూ తాప్సీ పన్ను తన కెరీర్ విషయాలను పంచుకొన్నారు.


Click it and Unblock the Notifications











