పెళ్ళిపై పెదవి విప్పిన తమన్నా.. అసలు విషయం చెప్పేసిందిగా!
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా భాటియాకి ఇప్పుడు క్రేజ్ తగ్గింది. కొత్త భామల ఎంట్రీ సహా సరైన హిట్ సినిమాలు లేకపోవడంతో ఈ భామ వెనకబడింది. అయితే ఈ భామ ఇప్పుడు సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇక సినిమా అవకాశాలు దొరకడం కష్టం అని భావించిన ఆమె ఇక పెళ్లి చేసేసుకుంటోందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ వార్తలు తమన్నా దాకా వెళ్లడంతో ఆమె స్పందించక తప్పలేదు. ఈ విషయం మీద ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

చాంద్ సా రోషన్ చెహ్రా
హిందీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసినా తమన్నా ఎక్కువగా తెలుగు సినిమాల్లో క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు తరువాత ఎక్కువ తమిళ సినిమాల్లో నటించిన తమన్నా నటిగా తన ప్రస్థానం 2005లో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో మొదలుపెట్టింది. అదే ఏడాది 'శ్రీ' సినిమాతో తెలుగులో, ఆ తదుపరి ఏడాది కేడీ సినిమాతో తమిళంలో అడుగు పెట్టింది.

హ్యాపీ డేస్ తో
ఆమె 2007లో తెలుగులో శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమాలో మధు అనే కాలేజ్ విద్యార్థినిగా నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అందు కోవడంతో తమన్నాకి నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో ఆమె మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పని పడలేదు. రెడీ, 100 % లవ్, ఊసరవెల్లి, కెమెరామెన్ గంగతో రాంబాబు, రచ్చ, బాహుబలి లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.

విడుదలకు సిద్ధంగా
అయితే ఇక ఈ మధ్య కాలంలో ఎందుకో కానీ ఆమె క్రేజ్ తగ్గింది. తెలుగులో చివరగా సీటిమార్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆమె గని సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో కూడా మెరిసింది. ఆమె ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కాకుండా ఆమె చేసిన ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

తమన్నా పెళ్లి
అయితే ఎలా మొదలైందో ఏమో తెలియదు కానీ ఈ మధ్య తమన్నా పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది. తమన్నా త్వరలో పెళ్లి చేసుకోబోతుందని ఇప్పటికే తమన్నా కుటుంబ సభ్యులు అమ్మడికి ఓ మ్యాచ్ కూడా చూశారని ఆమె ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతుందని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి.

తప్పకుండా చేసుకుంటా .. కానీ
తాజాగా ఈ వార్తలపై తమన్నా స్పందించింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయమై ఆమె స్పందిస్తూ పెళ్లి తప్పకుండా చేసుకుంటా .. కానీ ఇప్పుడు కాదనితేల్చేసింది. నా పెళ్లి చూడాలంటే మరో రెండు సంవత్సరాలు ఆగాల్సిందే అని కుండ బద్దలు కొట్టేసింది తమన్నా.. పెళ్లి విషయంలో మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లే అంటూ తమన్నా కొట్టి పారేసింది. ప్రస్తుతానికైతే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నా అంటూ ఆమె అసలు విషయం చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











