ఆ రెండు తెలుగు చిత్రాల కోసం తమన్నా ప్రయోగం: అందుకే భారీగా తీసుకుందట
టీనేజ్‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. దాదాపు పదేళ్లకు పైగానే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటింది. తద్వారా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ మిల్కీ బ్యూటీ.. 'సీటీమార్' అనే సినిమాతో పాటు 'ఎఫ్3'లోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాల విషయంలో తమన్నా ఓ ప్రయోగం చేయబోతున్నట్లు ఓ న్యూస్ లీకైంది.
చాలా రోజులుగా సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న తమన్నా భాటియా.. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు గోపీచంద్ సరసన 'సీటీమార్' అనే సినిమాలో చేస్తోంది. అలాగే, సూపర్ హిట్ మూవీ సీక్వెల్‌గా వస్తున్న 'ఎఫ్3'లోనూ అదిరిపోయే రోల్ చేస్తోంది. ఈ రెండింటికి సంబంధించిన షూటింగ్‌లను దాదాపుగా పూర్తి చేసిన తమ్మూ.. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోబోతుందట. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయా సినిమాల యూనిట్లు సంతోషంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక, కొన్నాళ్లుగా హిట్ అందుకోలేకపోతున్నప్పటికీ.. తమన్నాకు మాత్రం బాగానే డిమాండ్ ఏర్పడింది. అందుకే ఈ రెండు సినిమాల కోసం ఈ బ్యూటీకి భారీ మొత్తాలు రెమ్యూనరేషన్‌గా అందించారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గోపీచంద్ నటిస్తోన్న 'సీటీమార్'లో తమన్నా కబడ్డీ కోచ్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, 'ఎఫ్3'లో విక్టరీ వెంకటేష్ పాత్రను ఇబ్బంది పెట్టే భార్యగా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. లాక్‌డౌన్ తర్వాత ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











