Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆ ఒక్క ఘటనే నా జీవితాన్ని తలకిందులు చేసింది - మహిమా చౌదరి
మనసులో మాట అనే సినిమాలో హీరో శ్రీకాంత్ లో ఆడిపాడిన అందాల రాశి మహిమా చౌదరిని అంత త్వరగా మరచిపోలేం. ఈ డస్కీ బ్యూటీ, టాలీవుడ్ ను ఏలేస్తుందని అందరూ అంచనా వేశారు. అటు బాలీవుడ్ లోనూ మాంచి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన ఈ చిన్నది, ఇక తిరుగులేని హీరోయిన్ గా ఎదుగుతుందని భావించారు. కానీ, అలా జరక్కపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మిస్టరీగా మిగిలిపోయిన అమ్మడి కెరీర్... నటనా పరంగానూ మంచి మార్కులు వేయించుకుంటూ, టాప్ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకుంటోన్న మహిమా, సడన్ గా కనుమరుగవ్వడం మిస్టరీగా మిగిలిపోయింది. కొంతకాలానికి అమ్మడు తిరిగి రీ ఎంట్రీ ఇచ్చినా, అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వలేకపోయింది. అయినప్పటికీ, అడపాదడపా ఆఫర్లతోనే కాలం వెళ్లదీస్తోంది ఈ అందాల భామ.

జీవితాన్ని అతలాకుతలం చేసిన ఘటన
ఇంతకూ మహిమ, కెరీర్ కు అర్థాంతరంగా బ్రేకులు పడటానికి గట్టి కారణమే ఉంది. అప్పట్లో మాంచి ఫామ్ లో ఉన్న అజయ్ దేవగణ్ తో కలసి ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో జరిగిన ఓ సంఘటనే అమ్మడి జీవితాన్ని తలకిందలు చేసిందని తెలుస్తోంది. బెంగళూరులో షూటింగ్ జరుగుతన్న సమయంలో, స్టూడియోకు వెళుతుండగా, మహిమ ప్రయాణిస్తున్న కారును, ఓ ట్రక్ ఢీకొట్టిందట. ఆ ప్రమాదంలో మహిమ తీవ్రంగా గాయపడిందని తెలుస్తోంది.

నడిరోడ్డుపై రక్తపు మడుగులో....
ప్రమాదంలో కారు అద్దం మహిమ ముఖాన్ని ఢీకొట్టడంతో, ఆమె ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందట. ప్రమాద సమయంలోనూ ఎవరూ తనను ఆదుకోలేదని ఇటీవలే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయింది అమ్మడు. ఆసుపత్రిలో చేరిన తరువాత, అజయ్ దేవగణ్ తనను పరామర్శించేందుకు వచ్చాడని తెలిపింది. అయితే ప్రమాదం తాలూకు గాయాలు తన కెరీర్ కు శాపంగా మారాయని వెల్లడించింది.

ముఖానికి గుచ్చుకున్న 67 గాజుముక్కలు
శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు, తన ముఖం నుంచి సుమారు 67 గాజుముక్కలు వెలికితీసినట్లు వెల్లడించిన మహిమ, తరువాత అద్దంలో ముఖం చూసుకోలేక ఎన్నో రాత్రులు కుమిలిపోయానని తెలిపింది. తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ, కెరీర్ ఆశాజనకంగా లేకపోయిందని వాపోయింది.

అలాంటి పాత్రే కావాలి...
ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్న మహిమా చౌదరి, బాలీవుడ్ లో ఇంకా తనకు సరైన పాత్ర లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. విద్యాబాలన్ నటించిన తుమ్హారీ శుల్లూ వంటి పాత్రల్లో నటించాలని ఉందని మనసులోని కోరికను బయటపెట్టింది. మరి దర్శక నిర్మాతలు అమ్మడి కోరికను మన్నిస్తారేమో చూడాలి.