twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గ్లోబల్ స్కామ్ ఆర్టిస్ట్’ అంటూ ప్రియాంక చోప్రా మీద విషం చిమ్మిన అమెరికా మేగజైన్!

    |

    Recommended Video

    New York Magazine Apologizes For The Article On Priyanka Chopra

    బాలీవుడ్ స్టార్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మీద ఓ అమెరికా మేగజైన్ విషం కక్కింది. ప్రియాంక ఇటీవల అమెరికన్ నటుడు, సింగర్ నిక్ జొనాస్‌‌ను పెళ్లాడిన నేపథ్యంలో 'ది కట్' అనే మేగజైన్ సంచలన కథనం ప్రచురించింది. ప్రియాంకను 'గ్లోబల్ స్కామ్ ఆర్టిస్ట్' గా పేర్కొంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసింది.

    అయితే ఈ కథనం ప్రచురించిన కొన్ని గంటల తర్వాత తన వెబ్ సైట్ నుంచి సదరు మేగజైన్ దాన్ని తొలగించడం గమనార్హం. అయితే అప్పటికే ప్రియాంక మీద విషం చిమ్మిన సదరు కథనం ఇంటర్నేషనల్ వైడ్ వైరల్ అయింది.

    ఇది మోసపూరిత సంబంధం అంటూ...

    ఇది మోసపూరిత సంబంధం అంటూ...

    నిక్ జొనాస్ తనకు ‘ఇష్టం లేకున్నా ఒక మెసపూరిత సంబంధం'లోకి అడుగు పెట్టారంటూ ‘ది కట్ మేగజైన్' తన కథంలో పేర్కొంది. ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ మధ్య ఉన్నది ఫేక్ రిలేషన్‌షిప్ అంటూ ఆ కథనం సారాశం.

    వీలైనంత త్వరగా ఇందులో నుంచి బయటపడు

    వీలైనంత త్వరగా ఇందులో నుంచి బయటపడు

    నిక్ జొనాస్ ఈ కథనం చదువుతున్నట్లు అయితే ‘వీలైనం త్వరగా ఇందులో నుంచి బయటపడు' అనే అర్థం వచ్చేలా సూచనలు చేయడం గమనార్హం. ఆ ఆర్టికల్ చూసిన నిక్ జొనాస్, ప్రియాంక చోప్రా అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.

    రచయిత జాత్యంహంకార చర్య

    రచయిత జాత్యంహంకార చర్య


    రచయిత మారియా స్మిత్ ఈ ఆర్టికల్ రాశారు. అందులో అతడి జాత్యహంకరా ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని, ప్రియాంక చోప్రా మీద ఇలా విషం చిమ్మే ప్రయత్నం సహించరానిదంటూ అభిమానులు మండి పడుతున్నారు.

    ప్రియాంక ఎదుగుదలను ఓర్వలేకే...

    ప్రియాంక ఎదుగుదలను ఓర్వలేకే...

    ఒక ఇండియన్ స్టార్ బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ఇండస్ట్రీ వరకు రావడంతో పాటు.... క్వాంటికో లాంటి అమెరికన్ టీవీ సిరీస్ ద్వారా సూపర్ స్టార్‌గా ఎదగడం జీర్ణించుకోలేకనే రచయిత మరాయా స్మిత్ ఈ కథనం రాసినట్లు స్పష్టం చేస్తోందనే వాదన తెరపైకి వచ్చింది.

     ఆర్టికల్ తొలగింపు, క్షమాపణలు

    ఆర్టికల్ తొలగింపు, క్షమాపణలు

    దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో వెంటనే ‘ది కట్' మేగజైన్ ఆ కథనం తమ వెబ్ సైట్ నుంచి తొలగించడంతో పాటు ‘స్కామ్ ఆర్టిస్ట్'గా పేర్కొన్నందుకు ప్రియాంక చోప్రాకు క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఏది ఏమైనా అమెరికాలో ఇంకా జాత్యహంకారం ధోరణి, ముఖ్యంగా ఇండియన్స్ మీద ఇది కొనసాగుతుందనడానికి ఈ కథనం ప్రత్యక్ష సాక్షిగా పలువురు పేర్కొంటున్నారు.

    English summary
    The Cut apologizes for article calling Priyanka Chopra a 'global scam artist'. Priyanka Chopra and Nick Jonas and their recent wedding that called the actress a 'global scam artist'. The piece, carried by The Cut, had the choicest of words to speak about Chopra. The piece began with calling Priyanka Chopra a 'modern-day scam artist' and went on to say how Nick Jonas married into a 'fraudulent relationship against his will'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X