For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Tholi Prema హీరోయిన్ కీర్తి రెడ్డి ఇంట్లో విషాదం.. ప్రాణానికి ప్రాణమైన వ్యక్తి మరణించడంతో..

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వకపోయినా కూడా ఒకే ఒక్క సినిమాతో మంచి గుర్తింపు అందుకున్నవారు ఉన్నారు. అలాంటి వారిలో తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ఒకరు. ఇక ఇటీవల ఆమె ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లి అనంతరం సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న కీర్తి రెడ్డి బెంగుళూరులోనే ఉంటున్నట్లు సమాచారం. ఇక మీడియాలో ఆమెకు ప్రాణానికి ప్రాణమైన వ్యక్తి మరణించారు అని తెలియగానే జనాలు షాక్ అవుతున్నారు.

  అలా కెరీర్ ను స్టార్ట్ చేసి..

  అలా కెరీర్ ను స్టార్ట్ చేసి..

  నటి కీర్తి రెడ్డి మొదట ఇంటీరియర్ డిజైనర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. తెలంగాణకు చెందిన అమ్మాయి అయినప్పటికీ ఆమె విద్యాభ్యాసం వివిధ రాష్ట్రాల్లో జరిగింది. భరతనాట్యంలో ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. సింపుల్ గా ఉండే కీర్తి రెడ్డి కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది.

  తొలిప్రేమ సినిమాతో

  తొలిప్రేమ సినిమాతో

  SV కృష్ణారెడ్డి - అలీ కాంబినేషన్ లో వచ్చిన గన్ షాట్ అనే సినిమా ద్వారా మొదటిసారి వెండితెరపై కనిపించింది. అనంతరం ఆమె పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్ ను పెంచుకుంది. ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కొన్నాళ్లకు ఛాన్సులు తగ్గడంతో మహేష్ బాబు అర్జున్ సినిమాలో సోదరిగా నటించిన విషయం తెలిసిందే.

  సుమంత్ తో విడాకులు

  సుమంత్ తో విడాకులు

  ఇక 2004 సినిమాలకు గుడ్ బై చెప్పి అక్కినేని హీరో సుమంత్ ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. 2006 వరకు బాగానే ఉన్న వారు ఆ తరువాత సడన్ గా విడాకులు తీసుకున్నారు. ఇద్దరం ఇష్ట ప్రకారమే విడాకులు తీసుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో సుమంత్ కూడా వివరణ ఇచ్చారు. ఇప్పటికి కూడా మేము మంచి స్నేహాహాలమని తెలియజేశాడు..

  తండ్రి మరణంతో..

  తండ్రి మరణంతో..

  అయితే హఠాత్తుగా ఇటీవల కీర్తి రెడ్డి తండ్రి మరణంతో ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె కెరీర్ కు ఎంతగానో సపోర్ట్ చేసి కష్ట సమయాల్లో తోడుగా ఉన్న తండ్రి కేశ్‌పల్లి (గడ్డం) ఆనంద్‌ రెడ్డి గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచారు. 60ఏళ్ళ వయసు కలిగిన ఆయన తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో గుండెపోటుతో మరణించారు.

  Popular Telugu YouTube Host #TNR Lost Life | Filmibeat Telugu
  మరో పెళ్లి చేసుకొని..

  మరో పెళ్లి చేసుకొని..

  కేశ్‌ పల్లి ఆనంద్‌ రెడ్డి నిజామాబాద్‌ మాజి ఎంపి కేశ్‌ పల్లి గంగారెడ్డి కుమారుడు. కాంగ్రెస్, బిజెపి వంటి పార్టీలలో రాజకీయ ప్రయాణం చేసి 2018 ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్‌ లో చేరారు. ఆయన ఇద్దరు కూతుళ్లు ఉండగా అందులో ఒకరు కీర్తి రెడ్డి హీరోయిన్ గా అందరికి తెలిసిన వారే. సుమంత్ తో విడాకులు తీసుకున్న అనంతరం ఆమె మరో పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడ్డారు. ఇక హైదరాబాద్ లో తండ్రి మరణవార్త విని ఆమె హైదరాబాద్ కు బయలుదేరినట్లు సమాచారం.

  English summary
  There are some heroines in the Tollywood industry who have received good recognition with a single movie even though it did not click in the range as expected. Keerthy Reddy, tholi prema heroine, is one of such people. More recently there was a serious tragedy in her home. Kirti Reddy, who is staying away from the film industry after her marriage, is reportedly staying in Bangalore. keerthi reddy father anand reddy passed away
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X