యాక్టింగ్‌కు ‘నువ్వు నేను’ ఫేమ్ అనిత బై బై.. కారణం అదేనంటూ!
టాలీవుడ్‌లో వరుస విజయాలను దక్కించుకొని అందర్నీ ఆకర్షించిన అనిత అలియాస్ అనితా హస్పనందానీ నటనకు స్వస్తి చెప్పారు. స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని ఆశించిన క్రమంలో ఆమె అనూహ్యంగా టాలీవుడ్ నుంచి కనుమరుగయ్యారు.
నువ్వు నేను, శ్రీరాం, తొట్టి గ్యాంగ్, నిన్నే ఇష్టపడుతాను. ఆడంతే.. ఆడో టైపు, నేను పెళ్లికి రెడీ, నేనున్నాను. రగడ, జీనియస్ లాంటి తెలుగు చిత్రాల్లో నటించారు. హిందీలో తాళ్, కుచ్ తో హై, యే దిల్, కృష్ణా కాటేజ్, రాగిణి ఎంఎంఎస్, హీరో, లాంటి చిత్రాల్లో నటించారు.

ఆ తర్వాత హిందీ సీరియల్స్ బిజీగా మారిపోయారు. ఉదర్ ఇదర్, కసౌటీ జిందగీ కే, యే హై మొహబ్బతే, నాగిన్ సిరీస్ 3, 4, 5 నటించారు. కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే రోహిత్ రెడ్డిని 2013లో వివాహం చేసుకొన్నారు. ఇటీవలే ఓ చిన్నారికి ఈ దంపతులు జన్మనిచ్చారు.
తన తొలి సంతానం తర్వాత మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన నిర్ణయం తీసుకొన్నట్టు అనిత వెల్లడించారు. సినీ, టెలివిజన్‌కు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను. తల్లిగా నా బిడ్డపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని అనుకొంటున్నాను. కరోనావైరస్ ఉన్నా లేకపోయినా నా నిర్ణయం ఇలానే ఉండేది అని అనిత వెల్లడించారు.
కోవిడ్ పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. నేను ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఒకరిని మాత్రమే లోనికి రానిస్తున్నాం. కరోనావైరస్ ముంబైలో ప్రమాదకరంగా మారడంతో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొంటున్నాం అని అనిత చెప్పారు.


Click it and Unblock the Notifications











