Don't Miss!
- News
హైదరాబాద్లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Sports
టీ20ల్లో టాప్ ప్లేయర్లు.. వన్డేల్లో మాత్రం వేస్ట్.. టీమిండియా స్టార్ కూడా!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
13ఏళ్లుగా వెండితెరకు దూరమైన రంభ.. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా.. లేటెస్ట్ ఫ్యామిలీ ఫొటోస్ వైరల్!
తెలుగు హీరోయిన్స్ తగ్గిపోతున్న కాలంలో అందరికి షాక్ ఇచ్చేలా వెలుగులోకి వచ్చిన బ్యూటీ రంభ. నార్త్ హీరోయిన్స్ హవా ఎక్కువవుతున్న కాలంలో ఏ మాత్రం తగ్గకుండా పోటీపడి మరి గ్లామరస్ రోల్స్ తో మెప్పించింది. రంభను ఎవరు కూడా అంత ఈజీగా మర్చిపోలేరు. వెండితెరకు దూరమైన తరువాత ఈ బ్యూటీ ఎక్కడికి వెళ్లింది ఎక్కడ ఉంది అని అభిమానులు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ రంభ మాత్రం ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ఫ్యామిలీ లైఫ్ కు సంబంధించిన ఆనంద క్షణాలను ఫొటోల ద్వారా షేర్ చేసుకుంటూనే ఉంది.

తెలుగులోనే కాకుండా
సినిమా ప్రపంచంలో కేవలం అందంగా ఉన్నంత మాత్రానా హీరోయిన్స్ ఎక్కువ కాలం నిలదొక్కుకోలేరు. వారికి అమితమైన టాలెంట్ తో పాటు కాస్త అదృష్టం కూడా ఉండి తీరాల్సిందే. ఇక రంభ కూడా చిన్న స్థాయి నుంచి స్టార్ హీరోయిన్ వరకు వచ్చింది. ఒకనొక సమయంలో స్పెషల్ సోంగ్స్ తో కూడా మెప్పించింది. రియాలిటీ షోలతో జడ్జిగా కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ హిందీ భోజ్ పూరి ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా నటించింది.

తెలుగమ్మాయంటే నమ్మలేదు
రంభను మొదటి సారి వెండితెరపై చూసినప్పుడు అందరూ నార్త్ హీరోయిన్ అనుకున్నారు. కానీ ఆమె అచ్చమైన తెలుగు హీరోయిన్ అని చాలా రోజులకు తెలిసింది. అసలు పేరు విజయలక్ష్మి. పుట్టి పెరిగింది విజయవాడలోనే. అయితే స్కూల్ దశలోనే చిన్న చిన్న స్కిట్స్ ద్వారా సినిమాల్లో అవకశాలు అందుకుంది. ఒక తమిళ సినిమాలో స్పెషల్ పాత్రతో ఆమె సినీ జీవితం స్టార్ట్ అయ్యింది.

స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన సందర్భం
ఈవివి.సత్యనారాయణ ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హిట్ కొట్టిన రంభ ఒక్కసారిగా తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. 1993 నుంచి 2000వ సంవత్సరం వరకు కూడా రంభ బిజీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. 1994 వరుసగా 9 సినిమాలు చేసి అప్పటి లీడ్ హీరోయిన్స్ కు గట్టి పోటీని ఇచ్చింది.

ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో పోటీ పడుతూ..
ఇక
మెగాస్టార్
చిరంజీవి,
నాగార్జున,
బాలకృష్ణ,
వెంకటేష్,
రాజేంద్రప్రసాద్
ఇలా
దాదాపు
అందరి
హీరోలతో
స్క్రీన్
షేర్
చేసుకున్న
రంభ
ఎన్నో
బాక్సాఫీస్
హిట్స్
అందుకుంది.
అలాగే
స్పెషల్
సాంగ్స్
తో
కూడా
క్రేజ్
అందుకుంది.
దేశముదురు,
యమదొంగ
సినిమాల్లో
అప్పట్లో
అల్లు
అర్జున్,
ఎన్టీఆర్
వంటి
స్పీడ్
డ్యాన్సర్స్
తో
పోటీ
పడి
స్పెషల్
సాంగ్స్
లో
అదరగొట్టేసింది.

ప్రస్తుతం అక్కడే ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ..
ఇక
2008
అనంతరం
తెలుగు
సినిమాలకు
దూరమైన
రంభ
ఆ
తరువాత
అప్పుడప్పుడు
మళయాళం
సినిమాల్లో
నటించేది.
ఇక
2010లో
ఆమె
శ్రీలంకన్
బిజినెస్
మెన్
ఇంద్రకుమార్
పథ్మంథన్
ను
పెళ్లి
చేసుకొని
కెనడా
వెళ్ళిపోయింది.
ప్రస్తుతం
ఆమెకి
ఒక
బాబు
ఇద్దరు
అమ్మాయిలు
కూడా
ఉన్నారు.
గత
కొన్నేళ్లుగా
రంభ
అక్కడే
ఫ్యామిలీతో
లైఫ్
ను
ఎంజాయ్
చేస్తోంది.
మరి
మళ్ళీ
ఆమె
తెలుగు
తెరపై
సెకండ్
ఇన్నింగ్స్
ఏమైనా
స్టార్ట్
చేస్తుందో
లేదో
చూడాలి.