నా హనీమూన్ డేట్ కూడా ఫిక్స్ చేయండి.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన త్రిష

Trisha Krishnan: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్లలో త్రిష కృష్ణన్ ఒకరు. ఈ అమ్మడు రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే.. త్రిష నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీంతో త్రిష వ్యక్తిగత జీవితంపై పలు వార్తలు వస్తుంటాయి. ముఖ్యంగా పెళ్లి రూమర్స్ తరచుగా మీడియా హాట్ టాపిక్‌గా మారుతూ వస్తాయి. ఇటీవల ఫలానా వ్యక్తితో డేటింగ్ చేస్తుందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని ప్రచారం జరిగింది. ఈ రూమర్స్ పై త్రిష తన స్టైల్ లో షాకింగ్ రిప్లే ఇచ్చింది. ఇంతకీ ఏమన్నారంటే?

42 ఏళ్ల వయసులో కూడా హీరోయిన్ త్రిష మెయిన్ హీరోయిన్లుగా అవకాశాలు పొందుతూ సినిమాల ద్వారా వరుస సక్సెస్‌ హిట్స్ అందుకుంటుంది . తాజా చండీగఢ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో త్రిష మ్యారేజ్ జరగనుందంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి వార్తలపై తాజాగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసి, "నాకోసం నా జీవితాన్ని ప్లాన్‌ చేస్తున్న జనాలను నేను ప్రేమిస్తాను. హనీమూన్ షెడ్యూల్ కూడా చెబుతారేమోనని వేచి చూస్తున్నా" అంటూ సెటైరికల్ కామెంట్ చేశారు. ఈ విధంగా పెళ్లి వార్తలను పరోక్షంగా ఖండించారు.

Trisha Krishnan Breaks Silence on Wedding Rumors with Sarcastic Instagram Post

త్రిష కెరీర్ 1999లో 'జోడీ' సినిమాలో చిన్న పాత్రతో ప్రారంభమైంది. 2002లో 'మౌనం పెసియాదే' తో తమిళంలో హీరోయిన్‌గా పరిచయం పొందారు. ఆ తరువాత.. నీ మనసు నాకు తెలుసు'అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా సక్సెస్ తరువాత 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'అతడు', 'కృష్ణ', 'కింగ్', 'సైనికుడు', 'పూర్ణమి', 'థగ్ లైఫ్' తదితర చిత్రాలతో సత్తా చాటారు. తన 25 ఏళ్ల కెరీర్ లో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో అగ్రహీరోలతో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా నిలిచారు.

వ్యక్తిగత జీవితంలో కష్టాల వచ్చిన ఎదురొడ్డి నిలిచింది. తన కెరీర్ కాస్త డౌన్ అయిన సమయంలో 2015లో వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం జరిగింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ నిశ్చితార్థం రద్దయింది. పెళ్లి రద్దయైనా, ఆమె కెరీర్‌పై దృష్టి పెట్టి వరుస సినిమాలతో బిజీగా కొనసాగింది. ఇటీవల 'ఐడెంటిటీ', 'విదాయుమురిచ్చి', 'గుడ్ బాడ్ అగ్లీ', 'థగ్ లైఫ్' వంటి చిత్రాలలో నటించి అభిమానులను అలరించారు.

ఇప్పటివరకు త్రిష ప్రేమాయణాలు, పెళ్లి రూమర్స్, వ్యక్తిగత జీవితంపై వచ్చిన వార్తలన్నీ పరోక్షంగా లేదా సెటైరిక్‌గా ఖండిస్తూ, తన ప్రైవసీని కాపాడుతూ వస్తున్నారు. 42 ఏళ్ల వయసులో కూడా మెయిన్ హీరోయిన్‌గా అవకాశాలు పొందటం, సినిమాల ద్వారా తన ప్రతిభను నిరూపించటం, సోషల్ మీడియాలో హాస్యంతో రూమర్స్‌ను తాకకుండా ఉండటం త్రిషను ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర'చిత్రంలో, సూర్యకు జోడీగా 'కరుప్పు'లో నటిస్తూ అభిమానుల ముందుకు రాబోతుంది. త్రిష వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వడంతో పాటు, కెరీర్‌పై దృష్టి పెట్టి వరుస విజయాలను సాధిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X