ఉప్పెన బ్యూటీకి మెగాస్టార్ చిరు కానుక.. ఎమోషనల్ అయిన బేబమ్మా
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు బెబామ్మా అనే పేరు హాట్ టాపిక్ గా మారింది. సైలెంట్ గా మొదలైన ఉప్పెన సినిమా రెండేళ్ల అనంతరం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని సుకుమార్ తప్పితే మరెవరూ ఉహీంచలేదు. ఇక సినిమాలో హీరోయిన్ కృతి శెట్టికి అయితే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. గత ఏడాది నుంచి వాయిదా పడుతూ వచ్చిన ఆ సినిమా అసలు థియేటర్స్ లోకి వస్తుందా? లేదా ఓటీటీ లోనే రిలీజ్ అవుతుందా అని చాలా రూమర్స్ వచ్చాయి.
ఇక మొత్తానికి నిర్మతల జాగ్రత్తతో సినిమా థియేట్రికల్ గా విడుదలైంది. ఉప్పెన సక్సెస్ తో ఇప్పుడు కృతిశెట్టికి కు భారీ స్థాయిలో ఆఫర్స్ వస్తున్నాయి. అక్కినేని హీరోతో కూడా కలిసి సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆమెపై మెగాస్టార్ మరోసారి ప్రశంసలు కురిపిస్తు ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. నువ్వు పుట్టుకతోనే ఒక స్టార్ అంటూ.. కేవలం స్టార్ మాత్రమే కాదు అమేజింగ్ ఆర్టిస్ట్ కూడా అని మెగాస్టార్ కృతి ప్రతిభను ఒక లెటర్ ద్వారా కొనియాడారు.

ఇక మెగాస్టార్ అందించిన విషెస్ కు కృతిశెట్టి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. థాంక్యు సో మచ్ సార్ అంటూ.. మీరు ఇచ్చిన గిఫ్ట్.. అలాగే మీరు ఇచ్చిన సందేశం, చూపించిన నేను ఎన్నటికి మరచిపోలేను అంటూ కృతి శెట్టి ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. మొత్తానికి ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద ఆఫ్ సెంచరీ కొట్టేసింది. వరల్డ్ వైడ్ గా 70కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది


Click it and Unblock the Notifications











