ఊర్వశి రటేలా అర్ధనగ్నంగా.. మడ్ బాత్‌కు ఖర్చు ఎంతైందో తెలుసా?

బాలీవుడ్‌లో రాణిస్తూ దక్షిణాదిలో సుస్థిర స్థానం కోసం ప్రయత్నిస్తున్న ఊర్వశి రటేలా తన అందం వెనుక సీక్రెట్ బయటపెట్టింది. ఇటీవల తన అందాన్ని మెరుగు పరుచుకోవడానికి రేగడి బురదతో చేసిన స్నానానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అయింది. తన శరీరంపై ఉన్న విషపూరిత కణాలను తొలగించుకోవడానికి చాలా కాలంగా ఇలాంటి మడ్ బాత్‌ చేస్తున్నాను అంటూ తన ఇన్స్‌టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ఆ మడ్ బాత్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తన మడ్ బాత్ ఫోటోను షేర్ చేస్తూ.. కాళ్ల నుంచి తలభాగం వరకు రేగడి మట్టితో కవర్ చేస్తారు. అలా కాసేపు కూర్చోబెడుతారు. ఆ సమయంలో ఎవరైనా చూస్తే విగ్రహం మాదిరిగా కనిపిస్తాం. ఇలాంటి రకమైన స్నానం వల్ల శరీరానికే కాదు.. మనసుకు, మైండ్‌కు రిలాక్స్‌గా ఉంటుంది. ఇదే నా మడ్ బాత్ / మడ్ థెరపీ అంటూ కాప్షన్ పెట్టింది. ఇలాంటి థెరపీ వల్ల శరీరం నాజుకుగా, సున్నితంగా తయారు అవుతుంది. హాలీవుడ్ కీయారా నైట్లీ, గ్వెనెత్ పాల్త్రో లాంటి విరివిగా ఇలాంటి స్నానం, థెరపీ చేస్తారు అని మడ్ బాత్ గురించి విశేషాలను ఊర్వశి రటేలా పంచుకొన్నారు.

Urvashi Rautela Mud bath spa photo goes viral

ఊర్వశి రటేలా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. అలాగే తమిళ సినీ రంగంలోకి ప్రవేశించేందుకు సిద్దమవుతున్నారు. తమిళ చిత్రంలో మైక్రోబయాలిజిస్ట్‌గా, ఐఐటీయన్ పాత్రలో కనిపిస్తున్నారు. తెలుగులో సంపత్ నంది దర్శకత్వంలో బ్లాక్ రోజ్‌లో చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో రూపొందిన తిరుతు పాయలే 2 హిందీ రీమేక్‌లో కూడా నటిస్తున్నారు. అలాగే జీయో స్టూడియోస్ రూపొందించే ఇన్స్‌పెక్టర్ అవినాష్ అనే వెబ్ సిరీస్‌లో రణ్‌దీప్ హుడాతో కలిసి నటిస్తున్నారు. ఇది కాకుండా ఇటీవల గురు రాంధ్వాతో కలిసి డూబ్ గయే మ్యూజిక్ వీడియోలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X