గుట్టుచప్పుడుగా హీరోయిన్ యామీ గౌతమ్ పెళ్లి.. ప్రముఖ దర్శకుడితో డేటింగ్.. ప్రేమ వివాహం!
బాలీవుడ్‌తోపాటు దక్షిణాది చిత్రాల్లో తన నటనతో ఆలరించిన అందాల భామ యామీ గౌతమ్ పెళ్లి చేసుకొన్నారు. లాక్‌డౌన్ సమయంలో గుట్టుచప్పుడు కాకుండా బాలీవుడ్ దర్శకుడు అదిత్య ధార్‌ను వివాహమాడటంతో హిందీ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పెళ్లి తర్వాత సోషల్ మీడియా ద్వారా స్వయంగా తన వివాహం గురించి యామీ గౌతమ్ వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..

కొద్దికాలంగా లవ్ అఫైర్, డేటింగ్
అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హిందీ చిత్రం యూరీ చిత్రంతో మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకొన్న అదిత్యా ధార్‌తో కొంతకాలంగా సన్నిహితంగా యామీ గౌతమ్ ఉంటున్నారు. అయితే వారి అఫైర్ గురించి మీడియాలో కథనాలు వచ్చినా పెద్దగా స్పందించలేదు. ఎవరూ ఊహించిన విధంగా యామీ, ఆదిత్య వివాహం చేసుకొని బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశారు.

నిరాడంబరంగా వివాహం జరిగిందని..
ఇరు కుటుంబాల ఆశీర్వాదం, దీవెనల మధ్య అదిత్య ధార్‌తో నా వివాహం జరిగింది. లాక్‌డౌన్ కాలంలో అత్యంత నిరాడంబరంగా, ప్రైవేట్ కార్యక్రమంగా మా పెళ్లి జరిగింది. స్నేహం నుంచి ప్రేమ ప్రయాణం చేసిన మా జర్నీ పెళ్లితో మా బంధం మరో మెట్టు ఎక్కింది. మీ దీవెనలు మాకు అందించాలని కోరుకొంటున్నాం అని సంయుక్తంగా విడుదల చేసిన ఓ ప్రకటనను యామీ గౌతమ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు.

కోవిడ్ ప్రోటోకాల్స్ అనుగుణంగా
లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి యామీ, ఆదిత్య వివాహం జరిగింది. అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. కోవిడ్19 ప్రోటోకాల్స్ పాటిస్తూ వివాహం జరిగింది. పెళ్లి పెద్ద ఎత్తున్న చేసుకోవాలని అనుకొన్నప్పటికీ పరిస్థితుల కారణంగా నిరాడంబరంగా పెళ్లి జరిగింది అని యామీ గౌతమ్ సన్నిహితులు తెలిపారు.

యామీ గౌతమ్ కెరీర్ గురించి..
యామీ గౌతమ్ కెరీర్ విషయానికి వస్తే.. హిమచల్ ప్రదేశ్‌లో పుట్టి చంఢీగడ్‌లో పెరిగిన యామీ గౌతమ్ ఉల్లాస ఉత్సాహ అనే చిత్రం ద్వారా కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత నువ్విలా చిత్రంతో టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. హిందీలో వికీ డోనర్ చిత్రంతో పాపులారిటీని సంపాదించుకొన్నారు. ఆ తర్వాత తెలుగులో అల్లు శిరీష్‌తో గౌరవం చిత్రంలో నటించారు. హిందీలో యాక్షన్ జాక్సన్, బద్లాపూర్, హృతిక్‌తో కాబిల్, అమితాబ్‌తో సర్కార్ 3 చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఆమె నటించిన బూట్ పోలీస్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.
Recommended Video

అదిత్య ధార్ ప్రొఫెషనల్ జీవితం...
ఇక దర్శకుడు ఆదిత్య ధార్ విషయానికి వస్తే.. కాబుల్ ఎక్స్‌ప్రెస్ చిత్రంతో డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత హాల్ ఏ దిల్, వన్ టూ త్రీ, డాడీ కూల్, ఆక్రోష్, తేజ్ చిత్రాలకు లిరిక్ రైటర్‌గా, డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. యూరీ: ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంతో దర్శకుడిగా మారి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వం వహించిన ది ఇమ్మోరల్ ఆశ్వత్థామ చిత్రం విడుదల కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











