Don't Miss!
- News
రంగంలోకి ప్రధాని మోదీ - షా : తెలంగాణలో త్రిముఖ వ్యూహం..!!
- Finance
fpi: ఇండియన్ మార్కెట్ల నుంచి FPIల నిష్క్రమణ.. ఒక్క నెలలోనే అన్ని కోట్లా ??
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
ప్రియుడితో ఏకాంతంగా నయనతార: ఒకే రూమ్‌లో క్లోజ్‌గా.. పర్సనల్ పిక్ బయటకు రావడంతో!
సాదాసీదాగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆరంభంలోనే తన అందం, అభినయంతో అందరి దృష్టినీ ఆకర్షించిన బ్యూటీ నయనతార. హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన తక్కువ సమయంలోనే ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకుంది. ఫలితంగా స్టార్‌డమ్‌ను అందుకుంది. ఇక, అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ లేడీ సూపర్ స్టార్.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి తెగ సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అతడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నయనతారతో కలిసి తీసుకున్న పర్సనల్ సెల్ఫీని షేర్ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అంతటా నయనతారదే హవా
చాలా కాలంగా సౌతిండియాలో హవాను చూపిస్తూ దూసుకుపోతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరితో సినిమాలు చేస్తోన్న ఈ భామ.. తన పాత్రకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటోంది. అలా చాలా కాలంగా ఉత్తమ నటి అనిపించుకుంటోంది. ఇలా సుదీర్ఘ కాలంగా చేతి నిండా సినిమాలు చేస్తూ నయన్ ఫుల్ బిజీగా మారింది.
Samantha స్పోర్ట్స్ బ్రాతో సమంత అరాచకం.. అమాంతం పైకి లేపేసి షాకిచ్చిన హీరోయిన్

విఘ్నేష్‌తో లవ్‌లో విహరిస్తూ
నయనతార కెరీర్ పరంగా ఎంత సక్సెస్ అయిందో.. ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రం రెండు సార్లు విఫలమైంది. గతంతో ఓ స్టార్ హీరోతో పాటు ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ.. వాళ్లిద్దరితో బంధాన్ని పెళ్లి పీటల వరకూ తీసుకెళ్లలేకపోయింది. ఇలా రెండు బ్రేకప్‌ల తర్వాత ఇప్పుడు ఆమె విఘ్నేష్ శివన్ అనే దర్శకుడితో ప్రేమాయణం సాగించడం మొదలెట్టింది.

అప్పటి నుంచి బహిరంగంగా
నయనతార విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'నానుమ్ రౌడీ దాన్' అనే సినిమా చేసింది. ఆ సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు వీళ్లు సీక్రెట్‌గా వ్యవహారాన్ని నడిపించారు. కానీ, కొన్నేళ్ల క్రితం తమ బంధాన్ని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఈ జంట అందరికీ తెలిసేలా ఎంజాయ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతూనే ఉంది.
Pooja Hegde: పూజా హెగ్డే అందాల జాతర.. ఉల్లిపొరలాంటి బట్టల్లో యమ హాట్‌గా!

పెళ్లి ఎప్పుడు? ఆ ఫొటో రచ్చ
విఘ్నేష్ శివన్.. నయనతార చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తోన్నా.. పెళ్లిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అసలు వీళ్లు వివాహం చేసుకుంటారా? లేదా? అని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించింది. ఇక, కొద్ది రోజుల క్రితమే నుదుటిపై బొట్టుతో కనిపించింది. దీంతో వీళ్ల పెళ్లి అయిందని రచ్చ లేచింది.

అందులో నయన్ గురించేనా
సినిమాల మీద సినిమాలు తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఈ క్రమంలోనే నిత్యం ఫ్యాన్స్‌తో ఎన్నో విషయాలను పంచుకుంటుంటాడు. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక ఫొటోనో, వీడియోనో, అప్‌డేట్‌నో ఇస్తుంటాడు. అందులో కూడా ఎక్కువగా నయనతార గురించే చెప్తుంటాడు.
Bigg Boss Non Stop: ఆ కంటెస్టెంట్‌తో ఆరియానా శోభనం.. ఎన్నోది అన్న శివ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

పర్సనల్ పిక్‌ను షేర్ చేశాడు
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే విఘ్నేష్ శివన్.. నయనతారతో దిగిన ఓ సీక్రెట్ ఫొటోను షేర్ చేశాడు. ఇది ఓ రూమ్‌లో తీసిన పర్సనల్ ఫొటో. ఇందులో ఇద్దరూ అద్దం ముందర నిల్చుని సెల్ఫీలా తీసుకున్నారు. గతంలో ఎన్నడూ చూడని ఈ పర్సనల్ ఫొటోను విఘ్నేష్ పోస్ట్ చేశాడు. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది.

ఊపిరి పీల్చుకుంటున్నానని
నయనతారతో కలిసున్న ఫొటోను షేర్ చేసిన విఘ్నేష్ శివన్.. 'బిజీ షెడ్యూల్ నుంచి ఉపశమనం లభించింది. ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నట్లు అనిపిస్తోంది. సినిమాను సెన్సార్ వరకు తీసుకెళ్తున్నాం.. అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం' అని పోస్ట్ చేశాడు. ఇక, విఘ్నేష్.. నయనతార, సమంత, విజయ్ సేతుపతితో 'కాథువాక్కుల రెండు కాదల్' మూవీ చేస్తున్నాడు.