Don't Miss!
- Sports
INDvsNZ : మూడో టీ20లో తాడో పేడో.. సిరీస్ డిసైడర్‌లో వాతావరణం ఎలా ఉండబోతోంది?
- Finance
PMCares: PMCares రాజ్యాంగబద్ధమా ? RTI కిందకు వస్తుందా ? విరాళాల సంగతేంటి..??
- News
ఈటలపై అభ్యర్థి ఫిక్స్: ప్రకటించిన కేటీఆర్; గెల్లు శ్రీనివాస్ కు షాక్!!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
విజయనిర్మల ఆంటీకి కృతజ్ఞతలు.. విజయశాంతి ఎమోషనల్
లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ ఇలా ఎలా పిలిచినా సరే అవన్నీ కేవలం విజయ శాంతికి మాత్రమే సరిపోతాయి. గ్లామర్, ఎమోషనల్, యాక్షన్ ఏ జానర్ అయినా సరే విజయశాంతి తరువాతే ఎవరైనా. 90వ దశకంలో విజయశాంతి స్టార్డంను చూస్తే ఎవ్వరికైనా సరే కళ్లు తిరగాల్సిందే. కర్తవ్యం సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకుని టాలీవుడ్‌ను తలెత్తుకునేలా చేసింది. అలాంటి లేడీ సూపర్ స్టార్ సినీ ప్రయాణానికి నేటికి 40 యేళ్లు అవుతున్నాయట.
విజయశాంతి మొదటి చిత్రం కిలాడి కృష్ణుడు విడుదలై 40 ఏళ్లు అవుతున్న సందర్భంలో కాస్త ఎమోషనల్ అయింది ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. 'నా మొదటి తెలుగు సినిమా కిలాడి కృష్ణుడు విడుదలై నేటికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నాలుగు దశాబ్దాల పయనంలో సహృదయతతో ఆదరించి, అనేకమైన అద్భుత విజయాలను, సమున్నతమైన స్థానాన్ని అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు అందించారు.

నాకు తోడుగా నిలిచిన వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్న సందర్భం ఇది. నన్ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన సూపర్‌స్టార్ కృష్ణ గారికి, ఆంటీ విజయనిర్మల గారికి మరోసారి కృతజ్ఞతలతో' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ మధ్యే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో లెక్చరర్ భారతి పాత్రలో రాములమ్మ అదరగొట్టేసింది. తనకు ప్రాధాన్యమున్న పాత్రలు వస్తేనే సినిమాలు చేస్తానని, మళ్లీ సరైన ప్రాజెక్ట్ వస్తే చేస్తానని విజయశాంతి ఆ మధ్య చెప్పుకొచ్చింది.