బ్యాక్ లెస్ గా కనిపించి షాకిచ్చిన హీరోయిన్.. యమా హాట్ గురూ!

ఢిల్లీలో పుట్టిన పంజాబ్ భామ యషికా ఆనంద్ చెన్నైలో సెటిలై మోడల్‌ గా కెరీర్ ప్రారంభించింది. ఇక యషికా ఆనంద్ విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉండే ఈ భామ తాజాగా ఒక హాట్ ఫోటో షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

మోడల్ గా మొదలుపెట్టి

మోడల్ గా మొదలుపెట్టి

మోడల్ గా క్రేజ్ లభించాక టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ భామ 2016లో ధురువంగల్ పత్తినారు అనే తమిళ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. 2018లో అడల్ట్ కామెడీ, ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారి 2019లో కఝుగు 2, జాంబీ సినిమాలతో కూడా పలకరించింది. అలాగే బిగ్ బాస్ 2 తమిళ్ ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది.

బిగ్ బాస్ తో క్రేజ్

బిగ్ బాస్ తో క్రేజ్

బిగ్ బాస్ 2 తమిళ్ తర్వాత సినిమాల్లో బిజీగా మారారు. మణిరత్నం దర్శకత్వం వహించిన నవాబ్ సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించారు. ఇక పెళ్ళికి ముందు వర్జినిటీ కోల్పోవడం గురించి ఈ భామ కామెంట్లు చేసి అప్పట్లో రచ్చ రేపింది. పెళ్లికి ముందు కన్యత్వం కోల్పోతే తప్పేం కాదని, ప్రస్తుతం పరిస్థితుల్లో అలాంటి విషయాలను ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పి వివాదాస్పదంగా మారింది.

లాక్ డౌన్ లో పెళ్లిరచ్చ

లాక్ డౌన్ లో పెళ్లిరచ్చ

ఇక గత ఏడాది లాక్ డౌన్ లో కూడా ఈ భామ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఏకంగా ఆమె పెళ్లి చేసేసుకుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ వార్తలకు తగినట్టుగానే సంప్రదాయమైన సిల్క్ చీరలో, నుదుట బొట్టు పెట్టుకొని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే అదంతా ఒక ఫోటో షూట్ అని ఆమె తేల్చేసింది.

హాట్ ట్రీట్

హాట్ ట్రీట్

ఇక ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే ఈ భామ తాజాగా ఒక హాట్ ఫోటోతో ట్రీట్ ఇచ్చింది. ఒక స్పెషల్లీ మేడ్ మోడరన్ డ్రెస్ లో బ్యాక్ లెస్ గా కనిపిస్తూ ఆమె తన ఫాలోవర్స్ కు అదిరే హాట్ ట్రీట్ ఇచ్చింది. దానికి లవ్ సింబల్ పోస్ట్ చేసిన ఈ భామ హాట్ సింబల్ కూడా పోస్ట్ చేసింది.

Recommended Video

Dubbing artiste Ghantasala Ratnakumar Career and How he achieved place in india Book of records
ఐదు సినిమాలతో బిజీ

ఐదు సినిమాలతో బిజీ

సినిమాల విషయానికి వస్తే కవలై వెండమ్ అనే చిత్రం ద్వారా యషికా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఇక ప్రస్తుతం ఏకంగా ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. ఇవాన్ తాన్ ఉతమన్, రాజా భీమ, కదమాయై సై, పంబట్టం, సల్పర్ సినిమాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X