For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తల్లైనా తగ్గని రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ: అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా ఫోజులు

  |

  సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది నటీమణులు సినిమాలు చేయకున్నా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండగలుగుతున్నారు. అదే సమయంలో తమ అందచందాలను ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. అలాంటి వారిలో హాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ ఒకరు. పేరుకు విదేశీ అమ్మాయే అయినా దక్షిణాదిలో హీరోయిన్‌గా సత్తా చాటిందీ బ్యూటీ. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ప్రియుడితో డేటింగ్ చేసి ఓ బిడ్డకు తల్లైంది. దీంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అమీ జాక్సన్ సోషల్ మీడియాలో ఘాటు ఫొటోలను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

  అలా పరిచయం.. రామ్ చరణ్ మూవీలోనూ

  అలా పరిచయం.. రామ్ చరణ్ మూవీలోనూ

  విదేశాలకు చెందిన అమ్మాయే అయినా.. సినిమాల్లో నటించాలన్న కోరికతో ఇండియాలో అడుగు పెట్టింది హాట్ బ్యూటీ అమీ జాక్సన్. ఈ క్రమంలోనే ‘మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిందామె. ఇందులో బ్రిటీష్ యువరాణి పాత్రను పోషించిన ఈ అమ్మడు.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. ఆ వెంటనే దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘ఐ', ‘రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

  Bigg Boss Telugu 5 సుడిగాలి సుధీర్‌కు బిగ్ బాస్ దిమ్మతిరిగే ఆఫర్: ఆ స్టార్ హీరో రేంజ్‌లో!

   అన్నింట్లోనూ మెప్పించి ఔరా అనిపించింది

  అన్నింట్లోనూ మెప్పించి ఔరా అనిపించింది

  అమీ జాక్సన్ విదేశీ అమ్మాయి కావడంతో ఆమె ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ బ్యూటీ ఆరంభంలోనే యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న రోల్‌లో మెరిసింది. ఆ తర్వాత కూడా గ్లామరస్ పాత్రలతో పాటు నటిగా మంచి ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసింది. అందుకే ఆమె నటించింది కొన్ని చిత్రాల్లోనేనైనా ఎక్కువ పేరును సంపాదించుకుంది. పలు చిత్రాల్లో సత్తా చాటిన ఈ అమ్మడు... ఉత్తమ నటిగా పలు అవార్డులను సైతం అందుకుంది. ఆ తర్వాత అమీ జాక్సన్‌కు వరుసగా ఆఫర్లు వచ్చినా కొన్నే చేసింది.

  అతడితో ప్రేమాయణం.. గర్భంతో నిశ్చితార్థం

  అతడితో ప్రేమాయణం.. గర్భంతో నిశ్చితార్థం

  ఇండియాలో చేతి నిండా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే అమీ జాక్సన్.. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో ప్రేమలో పడింది. అతడితో చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ అమ్మడు.. డేటింగ్ చేస్తున్న సమయంలోనే గర్భం దాల్చింది. దీంతో ఈ బ్యూటీ వ్యవహరం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. గర్భం దాల్చిన తర్వాత కొద్ది రోజులకు ఈ విదేశీ ప్రేమజంట నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయినట్లు ప్రకటించింది. అప్పట్లో ఈ న్యూస్ పెద్ద సంచలనం అయిపోయింది.

  బిడ్డకు తల్లైనా అమీ... బ్రేకప్ అయిందంటూ

  బిడ్డకు తల్లైనా అమీ... బ్రేకప్ అయిందంటూ

  జార్జ్‌ పనాయొటోతో డేటింగ్ చేస్తోన్న సమయంలో ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్ ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారితో కలిసి తరచూ ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తోంది. అంతేకాదు, ఎక్కువ సమయంలో తనతోనే గడుపుతూ సినిమాకు సైతం దూరం అయింది. ఇది జరుగుతున్నా అమీ జాక్సన్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. దీంతో అందరూ ఆమె వివాహం గురించి చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తాజాగా జార్జ్‌ పనాయొటోతో ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పేసిందని ఓ న్యూస్ బయటకు వచ్చింది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకుందట.

  హీరోయిన్ ఆండ్రియా అదిరిపోయే ఫొటోలు: షర్ట్ బటన్స్ తీసేసి మరీ బోల్డు ఫోజులు!

  అందులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోందిగా

  అందులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోందిగా

  అమీ జాక్సన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఈ విదేశీ నటి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్‌ గురించిన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఆమె తన అందమైన ఫొటోలు, వీడియోల కూడా షేర్ చేస్తూ తెగ హల్‌చల్ చేసింది. ఇంటర్నేషనల్ ఫిగర్ కావడంతో అమీ జాక్సన్ సోషల్ మీడియాలో ఇచ్చే అప్‌డేట్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలు చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.

  ఎక్కువగా అలాంటి ఫొటోలతో రచ్చ చేస్తోంది

  ఎక్కువగా అలాంటి ఫొటోలతో రచ్చ చేస్తోంది

  హాట్ బ్యూటీ అమీ జాక్సన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వాటిలో ఎక్కువ భాగం అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలే ఉంటాయి. అంతెందుకు గర్భంతో ఉన్న సమయంలోనూ గ్లామర్ ఫొటోలను వదిలింది. ఇక, ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను తన అందచందాలతో షేక్ చేసి పడేస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు కొన్ని లక్షల్లో లైకులు రావడంతో పాటు అమీ జాక్సన్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ గణణీయంగా పెరిగిపోతోంది. దీంతో ఈ బ్యూటీ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

  ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన యాంకర్ మంజూష: అదిరిపోయే ఫోజులతో ఘాటు ఘాటు ఫోజులు

  Prabhudeva Biography.. ఇన్స్పిరేషన్ మెగాస్టార్ !
  అందాలు మొత్తం కనిపించేలా ఘాటు ఫోజు

  అందాలు మొత్తం కనిపించేలా ఘాటు ఫోజు

  తాజాగా అమీ జాక్సన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె స్టైలిష్ డ్రెస్ వేసుకుని ఉంది. తద్వారా తన ఎద అందాలను క్లియర్‌గా చూపిస్తోంది. తల్లైనా ఇలాంటి ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఇది మాత్రమే కాదు.. అద్దం ముందు దిగిన ఓ హాట్ ఫొటోను కూడా ఇన్‌స్టాలో వదిలింది. ఇందులో ఆమె ఘాటు ఫోజులిస్తూ హోయలు పోయింది. దీంతో ఈ హాట్ హాట్ పిక్‌లకు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

  English summary
  Famous actress and a former model Amy Jackson Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram. These Pics Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X