Don't Miss!
- Finance
Investment: రూ.250 కోట్ల పెట్టుబడి నిర్ణయం.. పరుగులు మెుదలెట్టిన స్టాక్
- News
దేశ ప్రజలకు ప్రధాని మోడీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: అమరవీరులకు నివాళి
- Sports
Team India : ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్ కెరీర్ ముగిసినట్లేనా?
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Lifestyle
ఇంట్లో నైరుతి మూల వాస్తు చిట్కాలు, దోష నివారణలు
- Automobiles
హైవేపై అందంగా రీల్ చేసిన చిన్నది: కట్ చేస్తే రూ. 17,000 ఫైన్.. కారణం మాత్రం ఇదే
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
తెలుగు సినిమాలో హేట్ స్టోరీ3 బ్యూటీ.. గోపీచంద్‌కు హీరోయిన్‌గా!
టాలీవుడ్‌కు క్రమంగా బాలీవుడ్ భామల తాకిడి పెరుగుతోంది. ఇటీవల పలువురు బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్ చిత్రాల్లో రాణిస్తూ విజయాలు అందుకుంటున్నారు. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు వస్తున్నాయి. హేట్ స్టోరీ 3 చిత్రంలో అందాలు ఆరబోసిన జరీన్ ఖాన్ గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుందట.
కెరీర్ ఆరంభంలోనే కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్న జరీన్ ఖాన్ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. హేట్ స్టోరీ3, ఆస్కార్ 2 లాంటి చిత్రాల్లో అందాలు ఆరబోసినా జరీన్ ఖాన్ కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. గోపీచంద్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ తిరు దర్శత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా రాశి ఖన్నా ఎంపికైంది. మరో హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు జరీన్ ఖాన్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది.

జరీన్ ఖాన్ ఈ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. జరీన్ ఖాన్ తో ఈ చిత్రానికి మరింత గ్లామర్ తోడవుతుందని దర్శకుడు భావిస్తున్నాడు. బాలీవుడ్ లో జరీన్ ఖాన్ కు ప్రస్తుతం సరైన అవకాశాలు లేవు. సౌత్ లో అయిన తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని జరీన్ ఖాన్ భావిస్తోంది.