For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Birthday Christopher Nolan : హాలీవుడ్‌ గమనాన్నే మార్చేసిన 5 సినిమాలివే!

  |

  క్రిస్టోఫర్‌ నోలన్‌..మూసధోరణిలో ఉన్న హాలీవుడ్‌ గమనాన్నే మార్చేసిన ఓ దర్శకుడు. ఓటమి ఎరుగని అత్యద్భుతమైన ఎన్నో సినిమాలను ఆయన రూపొందించారు. మరీ ముఖ్యంగా నాటి తరం,నేటి తరమే కాదు భవిష్యత్‌ తరం కూడా స్ఫూర్తిగా తీసుకునే దిగ్దజ దర్శకుడు ఆయన. అద్భుత ప్రతిభగల దర్శకుడిగా, ఉత్తమాభిరుచిగల నిర్మాతగా, వినూత్న కథల రచయితగా యావత్‌ ప్రేక్షకలోకాన్ని ఫిదా చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి క్రిస్టోఫర్‌ నోలన్‌ పుట్టిన రోజు నేడు. ఆయన 1970 జులై 30న లండన్‌లోని వెస్టిమిస్టర్‌లో జన్మించారు. ఈ సంధర్భంగా ఆయన కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాలు ఏమిటి అనేది చూద్దాం.

  మెమెంటో (2000)

  మెమెంటో (2000)

  హాలీవుడ్‌లో రియల్ ఫిలిం మేకర్ లలో ఒకరిగా నోలన్‌ను నిలపెట్టడానికి ఈ మెమెంటో సహాయపడింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత విమర్శకుల ప్రశంసలు అందుకుంది, నాన్ లీనియర్ కథన నిర్మాణం, జ్ఞాపకశక్తి పరీక్ష మరియు భావోద్వేగాలతో దాని సంబంధాన్ని ఫిలిం మేకర్ చూపడంతో ప్రేక్షకులు ప్రశంసలు అందుకున్నారు. గై పియర్స్ లియోనార్డ్ షెల్బీ పాత్రలో నటించాడు, యాంటెరోగ్రేడ్ అమ్నీషియాతో బాధపడుతూ భార్య హంతకుడి కోసం వెతుకుతున్న వ్యక్తిగా ఆయన అద్భుతంగా నటించాడు.

  ప్రెస్టీజ్ (2006)

  ప్రెస్టీజ్ (2006)

  ఇది సైన్స్-ఫిక్షన్ ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్. హ్యూ జాక్మన్ మరియు క్రిస్టియన్ బేల్ లు నటించిన ఈ సినిమా ఆసక్తికరంగా సాగింది. విభిన్న సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు ఇంద్రజాలికుల మధ్య ఘోరమైన పోటీ గురించి ఈ సినిమా రూపొందించారు.

  ది డార్క్ నైట్ (2008)

  ది డార్క్ నైట్ (2008)

  ఇది క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బాట్మాన్ బిగిన్స్ (2005) యొక్క సీక్వెల్. అలాగే డార్క్ నైట్ సిరీస్ లో రెండవ భాగం, ఇప్పటివరకు చేసిన ఉత్తమ కామిక్ సినిమాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. నోలన్ ఈ సినిమాని తన ట్రేడ్మార్క్ ఐమాక్స్ కెమెరాతో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ముఖ్యంగా చిత్ర ప్రారంభంలో జోకర్ డబ్బు దొంగిలించే సన్నివేశం. ఈ చిత్రం జూలై 2008న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని 2000 దశాబ్దపు అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా అభివర్ణించారు. ఈ చిత్రం ఎక్కువ లాభాలను ఆర్జించిన 19వ చిత్రంగా గుర్తింపు పొందింది. జోకర్ పాత్ర పోషించిన హీత్ లెడ్జర్ ఆ సంవత్సరం ఆస్కార్ అవార్డులలో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు పొందారు.

  ఇన్ సెప్షన్ (2010)

  ఇన్ సెప్షన్ (2010)

  క్రిస్టోఫర్ నోలన్ ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌లో హీస్ట్ మూవీ జోనర్‌కు పూర్తిగా ఒక ట్విస్ట్ ఇచ్చారు. డోమ్ కాబ్ (లియోనార్డో డికాప్రియో), రాబర్ట్ ఫిషర్ (సిలియన్ మర్ఫీ) నటించిన ఈ సినిమా కలల దొంగతనం అనే కాన్సెప్ట్ మీద వచ్చిన ఈ సినిమా ప్రపంచ సినిమా ప్రేక్షకుల మరియు విమర్శకుల బుర్రకు పదును పెట్టింది.ఈ చిత్రం 4 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది.

  Prabhas పై Mission Impossible 7 Director కామెంట్స్, రూమర్స్ కి చెక్ || Filmibeat Telugu
  ఇంటర్స్టెల్లార్ (2014)

  ఇంటర్స్టెల్లార్ (2014)

  ఈ సినిమాలో కథానాయకుడుగా "మాథ్యు మెక్ కానవె" నటించారు. భూమి మీద మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు విశ్వంలొ ఇంకేమైనా పాలపుంతలో మనుష్యులు జీవించుటకు అనువైన స్థలం ఉందేమో వెతకడానికి బయలు దేరిన నలుగురు వ్యోమగాముల కథ ఇది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా $660.6 మిలియన్ డాలర్లు సంపాదించింది. ఆయన లిస్టులో చాలా అధ్భుతమైన సినిమాలు ఉన్నప్పటికీ ఈ ఐదూ టాప్ అనే చెప్పాలి.

  English summary
  Christopher Nolan is one of those rare filmmakers who make experimental, intellectual, original films that are commercially successful. on his birthday here are his 5 Path-Breaking Films
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X