»   » 'ఎ బ్యూటిఫుల్‌ మైండ్‌' సినిమా నిజ జీవిత హీరో దుర్మరణం

'ఎ బ్యూటిఫుల్‌ మైండ్‌' సినిమా నిజ జీవిత హీరో దుర్మరణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ట్రెంటన్‌: ‘ఎ బ్యూటిఫుల్‌ మైండ్‌' (రస్సెల్ క్రో) సినిమాకి ప్రేరణ, నోబెల్‌ బహుమతి పొందిన గణిత శాస్త్రవేత్త అయిన జాన్‌ నాష్‌ మరణించారు. ఆదివారం న్యూయార్క్‌ పోలీసులు చేసిన ఒక ప్రకటనలో నాష్‌తో పాటు ఆయన భార్య కూడా మరణించారని తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

గణిత శాస్త్ర మేధావి, నోబెల్‌ బహుమతి గ్రహీత జాన్‌ ఫోర్బ్స్‌ నాష్‌ జూనియర్‌ (86), ఆయన భార్య అలీసియా నాష్‌ (82)లు ఒక కారు ప్రమాదంలో మరణించారు. అమెరికాలోని న్యూజెర్సీ టర్న్‌పైక్‌లో ఈ ఘటన జరిగింది. విమానాశ్రయం నుంచి ఒక క్యాబ్‌లో ఈ జంట ఇంటికి తిరిగొస్తున్నప్పుడు ప్రమాదం సంభవించింది.

ఎలా జరిగిందంటే... 86 ఏళ్ల నాష్‌, 82 ఏళ్ల అలీసియాతో కలిసి శనివారం కారులో ప్రయాణిస్తుండగా.. ముందు వెళ్తున్న కారును డ్రైవర్‌ ఓవర్‌టేక్‌ చేయబోయాడు. అయితే.. అదుపు తప్పి రోడ్డుపక్క రైలింగ్‌ను కారు ఢీకొనగా నాష్‌ దంపతులు మరణించారు. గాయపడిన టాక్సీ డ్రైవర్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

'A Beautiful Mind' mathematician John Nash dies

అద్భుతమైన మేధావిగా, చంచల స్వభావిగా నాష్‌ గురించి చెబుతారు. అనేక సంవత్సరాల పాటు ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో ఆయన పనిచేశారు. ఇటీవలి వరకూ సీనియర్‌ పరిశోధన గణితశాస్త్రవేత్తగా వ్యవహరించారు. 'గేమ్‌ థియరీ'లో పరిశోధనకు గాను 1994లో ఆయనకు ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. ఈ పరిశోధనలో ఆయన మానవ పోటీతత్వంలో వివిధ కోణాలను ఆవిష్కరించారు.

20వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల ఆలోచనల్లో ఒకటిగా దీన్ని అభివర్ణిస్తారు. స్క్రిజోఫీనియాతో బాధపడుతున్న నాష్‌ జీవితంపై 'ఎ బ్యూటిఫుల్‌ మైండ్‌' పేరిట ఒక చలన చిత్రం కూడా వచ్చి అందరి ప్రశంసలూ పొందింది.

86 ఏళ్ల వయసులోనూ ఈ నెల్లోనే మరో గణిత శాస్త్రవేత్త లూయిస్‌ నిరెన్‌ బర్గ్‌తో కలిసి నాష్‌ నార్వేకు చెందిన ప్రతిష్ఠాత్మక బహుమతి అబెల్‌ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ‘గేమ్‌ థియరీ-ది స్టడీ ఆఫ్‌ డెసిషన్‌ మేకింగ్‌' సిద్ధాంతానికి 1994లో ఆయనకు ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి లభించింది.

English summary
Mathematician John Nash, who won the Nobel Prize in 1994 and was the inspiration for the film "A Beautiful Mind", died on the weekend along with his wife in a New Jersey taxi accident, media reported. He was 86.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu