twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎరక్కపోయి ఇరుక్కుంది... హీరోయిన్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష!

    |

    సౌత్ కొరియాకు చెందిన ఓ నటి థాయ్‌లాండ్‌లో ఐదేళ్ల జైలు అనుభవించే పరిస్థితుల్లో ఇరుక్కుంది. టీవీ రియాల్టీ షో కోసం చేసిన ఓ స్టంట్‌లో భాగంగా అంతరించి పోతున్న అరుదైన సముద్రపు జీవిని పట్టుకోవడమే ఇందుకు కారణం. ఈ కేసుకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

    సౌత్ కొరియాలో పాపులర్ రియాల్టీ షో 'లా ఆఫ్ ది జంగిల్' షూటింగులో భాగంగా... లీ యోల్ అనే నటి థాయ్‌లాండ్ నేషనల్ మెరైన్ పార్కులో నీటిలో డైవింగ్ చేస్తూ ఓ సముద్ర జీవిని పట్టుకుంది. దాన్ని పైకి తీసుకుని వచ్చి 'నేను పట్టుకున్నాను' అంటూ ఓ వీడియో విడుదల చేసింది.

    అధికారుల కంటపడిన వీడియో

    అధికారుల కంటపడిన వీడియో

    అయితే ఆమె పట్టుకున్న సముద్రపు జీవి అంతరించి పోతున్న జాతుల జాబితాలో ఉందట. థాయ్ చట్టాల ప్రకారం ఆ జీవిని పట్టుకోవడం నేరం. లీ ఆ జీవిని పట్టుకున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.... ఇది థాయ్ అధికారుల దృష్టికి వెళ్లింది.

    వెనక్కి తగ్గేది లేదంటున్న అధికారులు

    వెనక్కి తగ్గేది లేదంటున్న అధికారులు

    వెంటనే ఈ ఘటనపై థాయ్ అధికారులు కేసు నమోదు చేశారు. రెండు చార్జ్ షీట్లు ఓపెన్ చేశారు. నేషనల్ పార్క్ నిబంధనలు అతిక్రమించడం, వన్యప్రాణుల రక్షణ చట్టం ఉల్లఘించడం అనే రెండు నేరాలను ఆమెపై మోపారు. ఇది క్రిమినల్ కేసు కావడంతో కంప్లయింట్ వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని థాయ్ అధికారులు స్పష్టం చేశారు.

    ఐదేళ్ల వరకు జైలు శిక్ష

    ఐదేళ్ల వరకు జైలు శిక్ష

    ఈ కేసులో ఆమెకు దాదాపు ఐదేళ్ల జైలు శిక్ష పడుతుందని అధికారులు వెల్లడించారు. సదరు నటి థాయ్‌లాండ్‌లో లేనప్పటికీ ఆమెను పట్టుకోవడానికి దారులు వెతుకుతున్నామని తెలిపారు. కొరియా నటికి థాయ్‌లో ఐదేళ్ల జైలు శిక్ష అనే అంశం ఇంటర్నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయింది.

    క్షమాపణ చెప్పినా వదలని అధికారులు

    క్షమాపణ చెప్పినా వదలని అధికారులు

    తమకు తెలియక ఇలాంటి తప్పు జరిగిందని, ఇందుకు క్షమాపణలు చెబుతున్నట్లు రియాల్టీ షో నిర్వాహకులు వెల్లడించారు. అయితే అధికారులు మాత్రం శిక్ష విషయంలో వెక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. జైలు శిక్షతో పాటు 20వేల థాయ్ బాత్(650 డాలర్లు) జరిమానా కూడా ఉంటుందట.

    నటి లీ గురించి

    నటి లీ గురించి

    నటి లీ గురించిన వివరాల్లోకి వెళితే... ఆమె ఆరేళ్ల క్రితం టీవీ రంగంలోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి స్టడీగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. 2016లో వచ్చిన ‘మూన్‌స్టర్' అనే డ్రామా సిరీస్‌లో నటించారు. 2017లో వచ్చి బాక్సాఫీస్ క్రైమ్ డ్రామా హిట్ ‘ది కింగ్'లో యాక్ట్ చేశారు.

    English summary
    A South Korean actress Lee Yeol-eum faces up to five years in a Thai jail for catching endangered giant clams in a reality TV stunt, an official said. After prising two giant clams from the coral-laid seabed, Lee pumped them in the air yelling "I caught it!"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X