twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : ప్రభుదేవా చిత్రం కొరియా రీమేక్ లో గంగ్‌నమ్‌ స్టార్‌

    By Srikanya
    |

    కొరియా: దక్షిణాదిన ప్రజాదరణ పొందుతున్న చిత్రాలు ఉత్తరాదిలో పునర్‌నిర్మించటం కొత్తేమీ కాదు. కానీ మన దేశంలో రూపుదిద్దుకుని ప్రజాదరణ పొందుతున్న ఒక చిత్రం కొరియావాసులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ నృత్యదర్శకుడు రెమో డిసౌజా దర్శకత్వంలో నృత్యమే ప్రధాన అంశంగా వెండి తెరకెక్కిన మొట్టమొదటి త్రీడి చిత్రం 'ఎబిసిడి-ఎనీ బడీ కెన్‌ డాన్స్‌'. కేవలం రూ.12 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుని ఈ నెల్లోనే విడుదలై మంచి కలెక్షన్స్ సాధించింది.

    మనస్సులో బలమైన కోరిక ఉండాలే కానీ నృత్యం చేయడానికి ప్రతి ఒక్కరూ అర్హులే అంటూ సందేశాన్నిచ్చే ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతూ ఇప్పటి వరకు దాదాపు రూ.37 కోట్లు ఆర్జించింది. ఆయా డాన్స్‌ రియాలిటీ షోల్లో పాలుపంచుకున్న నృత్య కళాకారులతో పాటు ప్రముఖ నృత్య, సినీ దర్శకుడు ప్రభుదేవా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించారు. యూటీవీ మోషన్స్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకాదరణను సొంతం చేసుకోవడంతో దీనికి కొనసాగింపుగా ఎబిసిడి-2కు కూడా దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు రెమో.

    నృత్యం ఇతివృత్తంగా ఆద్యంతం ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం కొరియాకు చెందిన ఒక ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కంపెనీని కూడా ఆకర్షించింది. 'ఒప్పా గంగ్‌నమ్‌ స్టెల్‌' అంటూ చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రపంచాన్ని మొత్తాన్ని విలక్షణమైన తన డాన్స్‌ స్టెప్పులతో వూర్రూతలూగించిన 'పీఎస్‌వై' ఈ చిత్రంలో హీరో పాత్రలో కనువిందు చేస్తారని ఆ సంస్ధ అంటోంది. ఇక్కడ ప్రభుదేవా పోషించిన పాత్రలో అక్కడ ఆయన కనిపిస్తారు. సౌత్‌ కొరియా ర్యాపర్‌ 'పీఎస్‌వై' కేవలం ఒక్క గీతంతో ఆ దేశ సత్తాను ప్రపంచానికి చూపించారు. ఈ గంగ్‌నమ్‌ స్త్టెల్‌తో ఆయన సంపాదించుకున్న ప్రజాదరణను సొమ్ము చేసుకోవడానికి ఎబిసిడి చిత్రం ఉపయోగపడుతుందని ఆశిస్తోంది.

    ఈ కొరియా చిత్ర నిర్మాణ సంస్థ. ఇప్పటి వరకు కేవలం హింసాత్మక చిత్రలతో పాటు నాటకీయంగా ఉండే చిత్రాలను మాత్రమే తెరకెక్కించే కొరియా చిత్ర నిర్మాతలు మొట్టమొదటి సారిగా నృత్యం ప్రధానాంశంగా చిత్రానికి ఒక రూపమివ్వనున్నారు. ప్రస్తుతం ఎబిసిడి చిత్రానికి సంబంధించిన హక్కులను యూటీవీ నుంచి కొనుగోలు చేయడానికి ఈ కొరియా నిర్మాణ సంస్ధ ప్రయత్నాలు మమ్మురం చేసింది.

    ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను సొంతం చేసుకున్నప్పటికీ యథాతధంగా కాకుండా కొరియా దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ చిత్రం ఉంటుందని, నృత్యమే ప్రధానాంశంగా చిత్రం రూపుదిద్దుకోనున్న నేపథ్యంలో స్థానికంగా ప్రజాదరణను చూరగొన్న పలు కొరియా నృత్యరీతులను దీనిలో ప్రతిబింబింపజేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తమ తాజా చిత్రం 'కాయ్‌ పో చే' ప్రచారంలో తలమునకలై ఉన్న యూటీవీ బృందం మాత్రం దీనికి సంబంధించి ఇప్పటి వరకు పెదవి విప్పకపోవడంగమనించదగ్గ విషయం.

    English summary
    Remo D’souza’s ‘ABCD’ is a box office success and we hear that the production house UTV Films has sold the remake rights to a South Korean filmmaker. ‘ABCD – Any Body Can Dance’ is India’s first 3D dance film. Rumor has it that South Korean ‘Gangnam style’ sensation Psy will star in the remake. He’ll be playing the role played by Prabhu Deva in the original. Also, Remo is currently is talks for a sequel to the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X