»   » ప్రతిష్టాత్మక ఆస్కార్ నామినేషన్ల ప్రకటన..!!

ప్రతిష్టాత్మక ఆస్కార్ నామినేషన్ల ప్రకటన..!!

Subscribe to Filmibeat Telugu

ప్రపంచ సినీపరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల నామినేషన్లు ప్రకటించారు. ఇందులో అందరూ అనుకున్నట్టుగానే జేమ్స్ కామెరూన్ 'అవతార్', క్యాథరీన్ బిగిలోవ్ 'ది హర్ట్ లాకర్' సినిమాలు అత్యధిక నామినీలు సొంతం చేసుకున్నాయి. ఉత్తమ సినిమా విభాగంలో ఏకంగా పది సినిమాలకు నామినేషన్లు లభించడం గమనార్హం. అవతార్, ది హర్ట్ లాకర్ సినిమాలు అత్యధికంగా తొమ్మిది విభాగాల్లో నామినేషన్లు సొంతం చేసుకున్నాయి.

అవతార్ సినిమా నామినేట్ అయిన విభాగాలు:
1. ఉత్తమ సినిమా
2. ఉత్తమ దర్శకుడు
3. ఆర్ట్ డైరెక్టర్
4. సినిమాటోగ్రఫీ
5. ఫిల్మ్ ఎడిటింగ్
6. ఒరిజినర్ సోర్స్
7. సౌండ్ ఎడిటింగ్
8. సౌండ్ మిక్సింగ్
9. విజువలో ఎఫెక్ట్స్

ది హర్ట్ లాకర్ సినిమా నామినేట్ అయిన విభాగాలు:
1. ఉత్తమ సినిమా
2. ఉత్తమ దర్శకుడు
3. ఉత్తమ నటుడు
4. సినిమాటోగ్రఫీ
5. ఫిల్మ్ ఎడిటింగ్
6. మ్యూజిక్
7. సౌండ్ ఎడిటింగ్
8. సౌండ్ మిక్సింగ్
9. ఒరిజినల్ స్క్రీన్ ప్లే

ఉత్తమ నటుడు క్యాటగిరీ నామినేషన్లు:
1. జెఫ్ బ్రిడ్జెస్ (క్రేజీ హార్ట్)
2. జార్జి క్లోనీ (అప్ ఇన్ ది ఎయిర్)
3. కొలిన్ ఫిర్త్ (ఓ సింగిల్ మ్యాన్)
4. మోర్గన్ ఫ్రీమ్యాన్ (ఇన్విక్టస్)
5. జెరిమై ర్న్నర్ (ది హర్ట్ లాకర్)

ఉత్తమ నటి క్యాటగిరీ నామినేషన్లు:
1. సాండ్రా బుల్లక్ (ది బ్లైండ్ సైడ్)
2. హెలెన్ మిర్రెన్ (ది లాస్ట్ స్టేషన్)
3. క్యారీ ముల్లిగన్ (ఆన్ ఎడ్యుకేషన్)
4. గ్యాబౌరే సిడిబే (ప్రీషియస్)
5. మిర్లీ స్ట్రీప్ (జూలీ & జులియా)

కాగా గత ఏడాది రెండు ఆస్కార్ లు గెలుచుకొని, రెండు గ్రామీ అవార్డులను కూడా సొంతం చేసుకున్న ఎఆర్ రెహమాన్ ఈ సారి నామినేషన్ పొందడంలో విఫలమయ్యారు. కపుల్ రీ ట్రీట్ సినిమాతో ఆయన నామినేషన్ బరిలో నిలిచినప్పటికీ సఫలీకృతుడు కాలేకపోయారు. కాగా ఈ అవార్డు విజేతలను మార్చి 7వ తేదీన ప్రకటిస్తారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu