రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ నటి మృతి.. ఆకస్మిక మరణంతో తీవ్ర దిగ్బ్రాంతి
హాలీవుడ్ నటి లిసా బేనెస్ రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడం సినీ ప్రముఖులను, అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. న్యూయార్క్ సిటీలో ఎలక్ట్రిక్ స్కూటర్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన ఆమె గత వారం రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు.
రోడ్డు ప్రమాదం లింకన్ సెంటర్‌కు సమీపంలోని అప్పర్ వెస్ట్ సైడ్ వద్ద చోటుచేసుకొన్నది. రోడ్డు దాటుతుండగా లిసా బెనెస్ రోడ్డు ప్రమాదానికి గురైంది. రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె తలకు తీవ్రమైనా గాయమైంది. దాంతో మౌంట్ సినై సెయింట్ ల్యుక్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. క్రిటికల్ పరిస్థితుల్లో ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించారు ఆమె సన్నిహితులు వెల్లడించారు.

లీసా బేనెస్ వయసు 65 సంవత్సరాలు. 80వ దశకంలో టెలివిజన్ సిరీస్ ద్వారా తన కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించి తనదైన నటనతో ఆకట్టుకొన్నారు. గోనే గర్ల్, లీగల్లీ బ్లాండేస్, బ్రోతెల్ లాంటి చిత్రాలతో అత్యంత ప్రేక్షకాదరణను సంపాదించుకొన్నారు.
టెలివిజన్ రంగంలో నాష్‌విల్లే, మేడమ్ సెక్రటరీ, మాస్టర్ ఆఫ్ సెక్స్, వన్స్ అపాన్ ఏ టైమ్, ఎన్‌సీఐఎస్, లా అండ్ ఆర్డర్, ది గుడ్ వైఫ్, బోస్టన్ లీగల్, డెస్పెరేట్ వైవ్స్ లాంటి సిరీస్‌లో నటించారు.


Click it and Unblock the Notifications











