Just In
Don't Miss!
- Sports
India vs England: 'టీమిండియాలో ఎందుకు లేవని ప్రశ్నించేవాళ్లు.. ఆ మాటలు నిత్యం గుర్తుకొచ్చేవి'
- News
ప్రముఖ రచయిత వేల్చేరు నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం...
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నగ్నంగా ఉండాలని ఆ డైరెక్టర్ ఫోర్స్ చేశాడు.. నటి ఎమోషనల్ కామెంట్స్
కాస్టింగ్ కౌచ్, మీటూ లాంటి ఉద్యమాల కారణంగా సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఎన్నో తెరచాటు వ్యవహారాలు బయట పడుతున్నాయి. నటీమణులు బాహాటంగా ఎలాంటి వణుకు లేకుండా తమపై జరిగిన లైంగిక దాడులకు బయటపెట్టేస్తున్నారు. ఈ విషయమై టాలీవుడ్ మొదలుకొని హాలీవుడ్ దాకా ఇప్పటికే ఎందరో స్టార్స్ నోరువిప్పగా.. తాజాగా అదే బాటలో మరో హాలీవుడ్ నటి ఎమీలియా క్లార్క్ సెన్సషనల్ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి పోతే..

అవసరం లేని చోట నా చేత దుస్తులన్నీ విప్పించారు
అమెరికన్ టెలివిజన్ డ్రామా సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో నటించిన ఎమీలియా క్లార్క్.. అవసరం లేని చోట తన చేత దుస్తులన్నీ విప్పించారంటూ ఆవేదన చెందింది. ఈ సిరీస్‌లో నటించినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ తన చేత బలవంతంగా నగ్న సన్నివేశాల్లో నటింప జేసినందుకు ఎంతో బాధగా ఉందని అంటోంది ఎమీలియా.

డైరెక్టర్ పట్టుబట్టి మరీ.. ప్రతీ రోజూ
ప్రతీ రోజు సెట్‌లో ఈ విషయమై తనకు, డైరెక్టర్స్‌కి మధ్య గొడవలు జరిగేవని చెప్పింది ఎమీలియా. దుస్తులు విప్పి నగ్నంగా నటించనని తాను అంటుంటే.. లేదు లేదు విప్పాల్సిందేనని అని ఆ డైరెక్టర్ పట్టుబట్టే వాడని ఆమె తెలిపింది. నగ్న సన్నివేశాల్లో నటించకపోతే ఫ్యాన్స్ బాధపడతారని డైరెక్టర్ అంటుండేవాడని చెబుతూ ఎమోషన్ అయ్యింది ఎమీలియా క్లార్క్.

తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది
అసలు ఆ సన్నివేశాల్లో నటించడానికి దుస్తులు విప్పాల్సిన అవసరమే లేకున్నా ఆ డైరెక్టర్ తన చేత అలా ఎందుకు చేయించారో ఇప్పటికీ అర్థం కావడం లేదని ఎమీలియా క్లార్క్ వాపోయింది. ఇలా తప్పని పరిస్థితుల్లో తాను ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఫస్ట్ సీజన్‌లో నగ్న సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.

ఇబ్బందికరంగా అనిపించేది కానీ..
ఒంటిపై బట్టలు లేకుండా ఇలా నగ్న సన్నివేశాల్లో నటించేటప్పుడు ఇబ్బందికరంగా అనిపించేదని ఎమీలియా చెప్పింది. ఎందుకంటే ఇదివకెప్పుడూ తాను ఇలాంటి సీన్లలో నటించింది లేదు కాబట్టి అని ఆమె తెలిపింది. ఎందుకు ఆ సమయంలో అందరి ముందు తాను నగ్నంగా నిలబడ్డానో తెలిసేది కూడా కాదని చెబుతూ బాధ పడుతూ చెప్పింది.

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్' పాపులారిటీ
ప్రపంచ వ్యాప్తంగా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్ భారీ పాపులారిటీ సంపాదించింది. ఈ ఒక్క షో వల్ల ఇందులో నటించినవారికి కూడా ఫుల్ పాపులారిటీ దక్కింది. ఈ సిరీస్‌లో నటించినవారిలో ఎమీలియా క్లార్క్ పలు సన్నివేశాల్లో నగ్నంగా కనిపించింది.