twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సారాజెవో గౌరవ పౌరసత్వానికి కృతజ్ఞతలు: ఏంజిలీనా జోలీ

    By Nageswara Rao
    |

    లండన్: హాలీవుడ్ సూపర్ స్టార్ ఏంజెలీనా జోలీ మాట్లాడుతూ తనని ఇటీవలే సారాజెవో గౌరవ పౌరురాలుని చేసినందుకు బోస్నియా ప్రజలు ధన్యవాదాలు తెలియ చేసింది. ఏంజిలీనా జోలీ దర్శకత్వ పర్యవేక్షణలో 'ఇన్ ద ల్యాండ్ బ్లడ్ అండ్ హానీ' సినిమా విడుదల చేసి అక్కడి ప్రజల మన్ననలను పొందిన విషయం తెలిసిందే. ఏంజిలీనా జోలీకి ఈ గౌరవాన్ని మే 3వ తారీఖున బోస్నియా రాజధాని 'సారజీవో' లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫంక్షన్‌ ఇవ్వనున్నట్లు బోస్నియా ప్రతినిధులు తెలిపారు.

    1990లో జరిగిన యథార్ద గాథ ఆధారంగా ఏంజిలీనా జోలీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో యుద్ద సమయంలో అలనాడు జరిగిన సంఘటలను కళ్లకు కళ్లినట్లు చూపించారు. అంతేకాకుండా ఓ సెర్బియన్ సోల్జర్, బోస్నియా మహిళ మధ్య చూపించిన రొమాన్స్ ఈ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాకు చేసిన అవిరళ కృషికి గాను సారాజెవో సారాజెవో కాన్టన్ పార్లమెంట్ అసెంబ్లీ బృందం 36సంవత్సరాల వయసు కలిగిన ఏంజిలీనా జోలీకి స్పెషల్ సిటిజన్ షిప్ ప్రైజ్‌ని అందించారు.

    ఈ వేడుక మే 3న సారాజెవో నేషనల్ థియేటర్‌లో జరిగింది. ఈ వేడుకలో జోలీ ముందుగా పంపిన ప్రీ రికార్డెడ్ వీడియో మెసెజ్‌ని ప్లే చేశారు. ఈ వీడియోలో ఏంజిలీనా జోలీ సారాజెవో సిటిజన్స్‌కి, సారాజెవో పార్లమెంట్ ప్రతినిధులకు నాకు ఈ అరుదైన గౌరవాన్ని కల్పించినందుకు గాను ధన్యవాదాలు తెలియజేశారు. ఈ గౌరవాన్ని వ్యక్తిగతంగా స్వీకరించేందుకు గాను జులైలో బోస్నియాను సందర్శించనున్నట్లు తెలిపింది.

    English summary
    Actress Angelina Jolie has thanked the people of Bosnia for making her an honorary citizen of Sarajevo. The actress-turned-director stepped behind the camera last year for “In the Land of Blood and Honey”, a story about a romance between a Serbian soldier and a Bosnian woman.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X