విషపు పూత లేఖలు పంపిన కేసులో నటి అరెస్టు

మొదట తన భర్త నథానియెల్ రిచర్డ్‌సన్ ఆ లేఖలను పంపాడని ఆమె తెలిపినప్పటికీ, అసలు దోషిని షానన్‌గా గుర్తించి అరెస్టు చేశారు. తన భర్త నుంచి విడాకుల కోసం దాఖలు చేసిన షానన్ ఎలాగైనా అతణ్ని వదిలించుకోవాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని నథానియెల్ తరుపున న్యాయవాది జాన్ డెక్ పేర్కొన్నారు.
షానన్ రిచర్డ్‌సన్ ద వాకింగ్ డెడ్, ద వాంపైర్ డైరీస్, ద బ్త్లెండ్ సైడ్ వంటి పలు హింసా చిత్రాల్లో నటించింది. ఆమెకు ఎలాంటి శిక్ష విధించాలనే దానిపై ఇంకా స్పష్టమైన నిర్ధారణకు రాలేదని అధికారులు పేర్కొన్నారు.
గుండుసూది మొన అంత ''రైసిన్'' విషం మనిషి వూపిరితిత్తుల వ్యవస్థను, కాలేయాన్ని క్షణాల్లో దెబ్బతీసి ప్రాణాలను హరిస్తుంది. దీనికి ఎలాంటి చికిత్సా విధానం అందుబాటులో లేదు.


Click it and Unblock the Notifications











