»   » ఆస్కార్ అవార్డ్ ప్రజెంట్ చేయబోతున్న ప్రియాంక!

ఆస్కార్ అవార్డ్ ప్రజెంట్ చేయబోతున్న ప్రియాంక!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఆస్కార్ అవార్డుల వేడుకకు అంతా సిద్ధమైంది. ఈ నెల 28న తేదీన గ్రాండ్ గా ఆస్కార్ ఈవెంట్ జరుగబోతోంది. ఈ కార్యక్రమంలో అవార్డులు అందుకోవడమే కాదు..... అవార్డులను తమ చేతుల మీదుగా ప్రజెంట్ చేయడం కూడా గౌరవంగానే భావిస్తారు. ఇప్పటికే కొంత మంది ప్రజెంటర్ల పేర్లు రిలీజ్ చేసారు. తాజాగా విడుదలైన రెండో విడుత ఆస్కార్ ప్రజెంటర్స్ లిస్టులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు స్థానం దక్కింది.

ఈ సెకండ్ లిస్టులో చోటు దక్కించుకున్న వారిలో ఎక్కువ శాతం విభిన్నమైన సాంస్కృతిక నేపథ్యం నుండి వచ్చిన వారే ఉండటం విశేషం. ప్రియాంక చోప్రా అమెరికన్ హిట్ టీవీ సిరీస్ ‘క్వాంటికో'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు ప్రజెంట్ చేసే అవకాశం రావడంపై ప్రియాంక చోప్రా ఆనందం వ్యక్తం చేస్తోంది.

Actress Priyanka Chopra To Present Oscars 2016 Award

ఈ ఆస్కార్ వేడుకల్లో ఇద్దరు భారతీయులు అవార్డు అందుకోబోతున్నారు. ఫిబ్రవరి 28న ఆస్కార్ అవార్డులు ప్రకటిస్తారు. అంతకంటే ముందు 10 సైంటిఫిక్, టెక్నికల్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ సైన్సెస్ ప్రధానం చేయనుంది. ఫిబ్రవరి 13న జరిగే కార్యక్రమంలో భారత సంతతికి చెందిన నటుడు, నిర్మాత రాహుల్ థక్కర్ అవార్డు అందుకోబోతున్నారు.

మరో భారతీయ మూలాలున్న వ్యక్తి, 44 ఏళ్ల కొట్టలాంగో లియోన్‌ ఈ ఏడాది సైంటిఫిక్‌ అండ్‌ టెక్నికల్‌ అఛీవ్‌మెంట్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు పొందారు. సోనీ పిక్చర్స్‌ ఇమేజ్‌ వర్క్స్‌లో డిజైన్‌, ఇంజినీరింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరించినందుకు గాను లియోన్‌ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

English summary
Oscars 2016 is just a few weeks away and the second wave of presenters is finally announced! Bollywood actress Priyanka Chopra will be presenting the award at Oscars 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu