»   » మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడు..!

మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రెసిడెంట్ ఈవిల్ ఈ సిరిస్ సినిమాలు మనం చాలా చూశాం. ముఖ్యంగా ఈ సినిమాలో మనం మనిషి మరణిస్తే ఏమవుతాడు. అతని దారుణమైన విచిత్రరూపాలు ఎలా వుంటాయి. అతని ప్రవర్తన చనిపోయిన తర్వాత ఎలా వుంటుంది. అనే కధాంశం తో తెరకెక్కుతున్న చిత్రం రెసిడెంట్ ఈవిల్ 4. ఈ చిత్రానికి మరణం తర్వాత అనే ఉపశీర్షిక కూడా వుంది. ఈ సినిమాని సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మంచగా, పాల్ ఆండర్సన్ దర్శకుడు.

ఈ సినిమాని తెలుగు లోకి అనువదించిన విశాఖ టాకీస్ వారు, నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ ఈ చిత్రంలో మిల్లా జోవో విచ్, అలీ లార్టర్, వెంట్ వర్త్ మిల్లర్ హీరో, హీరోయిన్ గా నటించారు. ఇంతకు ముందు వచ్చిన రెసిడెంట్ ఈవిల్ చిత్రాలు బాగా బాక్సా ఫీస్ రికార్డులను బద్ధలు కోట్టాయి. ఈ చిత్రం కూడా అదే స్థాయిలో ఆడాలనికోరుకుంటున్నాం. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో సెప్టెంబర్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu