»   »  ఆ నిర్మాత ఓ పంది... ఐశ్వర్య రాయ్‌ మీద కన్నేశాడు, మాజీ మేనేజర్ సంచలనం!

ఆ నిర్మాత ఓ పంది... ఐశ్వర్య రాయ్‌ మీద కన్నేశాడు, మాజీ మేనేజర్ సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వెయిన్‌స్టన్‌ పెద్ద కామాంధుడు అంటూ అమెరికాకు చెందిన ప్రముఖ మేగజైన్ ఆధారాలతో సహా ప్రచురించించి సంచలన క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తన సినిమాల్లో నటించే హీరోయిన్లను, నటీమణులను లైంగికంగా వేధింపులకు గురిచేసేవాడు, తన కోరిక తీర్చుకునేందుకు వేధింపులకు గురి చేశాడు అంటూ అతడిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి,

ఏంజెలీనా జోలీ, గైనెత్ పాల్ట్రో లాంటి ప్రపంచ ప్రఖ్యాత హీరోయిన్లను సైతం ఈ కామాంధుడు వేధించాడు. అతడి ద్వారా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటీమణులు ఒక్కొక్కరుగా అతడి నిజస్వరూపాన్ని బయట పెడుతుండటం హాలీవుడ్లో సంచలనం అయింది. అతడి గురించి తెలిసి అంతా ఆ నిర్మాతను అసహ్యించుకున్నారు.

మన ఐశ్వర్యరాయ్‌ని కూడా...

మన ఐశ్వర్యరాయ్‌ని కూడా...

మన ఇండియన్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కూడా అప్పట్లో కొన్ని హాలీవుడ్ సినిమాల్లో నటించింది. హాలీవుడ్లో అవకాశాల కోసం ఆమె ప్రయత్నిస్తున్న రోజుల్లో హార్వే వెయిన్‌స్టన్‌ కన్ను ఐశ్వర్యరాయ్ మీద పడిందట.

 ఆ విషయాన్ని గుర్తు చేసిన మేనేజర్

ఆ విషయాన్ని గుర్తు చేసిన మేనేజర్

ఇప్పుడు హాలీవుడ్‌లో నిర్మాత హార్వే వెయిన్‌స్టన్‌ వ్యవహారం హాట్ టాపిక్ కావడంతో..... అతడి కామ వేషాల గురించి ఒక్కొక్కరు బయట పెడుతున్నారు. అప్పట్లో ఐశ్వర్యరాయ్ మేనేజర్‌గా పని చేసిన సిమోనె షెఫీల్డ్ షాకింగ్ విషయం బయట పెట్టింది.

ఐష్‌తో మీటింగ్ కోసం బలవంత పెట్టేవాడు

ఐష్‌తో మీటింగ్ కోసం బలవంత పెట్టేవాడు

ఐశ్వ‌ర్య‌తో ఒంట‌రిగా స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని తనను హార్వే వెయిన్‌స్టన్ చాలా సార్లు బలవంతం పెట్టాడని, అతడి మనసులో ఉన్న తప్పుడు ఉద్దేశ్యం తాను ముందే పసిగట్టి తాను ఏర్పాటు చేయను అని మొహం మీదే చెప్పానని సిమోనె షెఫీల్డ్ తెలిపారు.

 నన్ను వెళ్లిపో అనేవాడు

నన్ను వెళ్లిపో అనేవాడు

ఐశ్వ‌ర్య‌ను ఒంట‌రిగా క‌ల‌వ‌డానికి హార్వే తీవ్రంగా ప్రయ‌త్నించేవాడు. మేం ముగ్గురం మాట్లాడుతున్న‌పుడు న‌న్ను అక్క‌డి నుంచి వెళ్లిపోమ‌నేవాడు. ఒక‌రోజు ఎలాగైనా ఐష్‌తో ఒంట‌రిగా స‌మావేశం ఏర్పాటు చేయ‌మ‌ని, అందుకోసం ఏమైనా చేయడానికి తాను సిద్ధమని న‌న్ను వేడుకున్నాడని సిమోనె షెఫీల్డ్ వెల్లడించారు.

వాడో పంది అంటూ...

వాడో పంది అంటూ...

హార్వే వెయిన్‌స్టన్‌ మీద సిమోనె షెఫీల్డ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాడో పంది లాంటోడు.... బిగ్ బుల్లీ పిగ్ మాదిరిగా బిహేవ్ చేసేవాడు. ఓసారి ఓవర్ యాక్షన్ చేస్తే చెప్పుతో కొట్టినట్లు తగిన సమాధానం చెప్పాను అంటూ సిమోనె షెఫీల్డ్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

 నా క్లెయింట్ల మీద వాడి నీడ ప‌డ‌నీయ‌లేదు

నా క్లెయింట్ల మీద వాడి నీడ ప‌డ‌నీయ‌లేదు

అతడి గురించి, అతడి ప్రవర్తన గురించి నాకు ముందే తెలుసు, అందుకే ఎప్పుడూ నా క్లెయింట్ల మీద వాడి నీడ ప‌డ‌నీయ‌లేదు అని సిమోనె షెఫీల్డ్ వెల్లడించారు.

నన్ను బెదరించాడు

నన్ను బెదరించాడు

అతడి చర్యలపై కోపం వచ్చి ఓసారి కోక్‌తో నింపిన‌ పంది బొమ్మ‌ను బ‌హుమ‌తిగా పంపించా. అప్పటి నుండి నన్ను టార్గెట్ చేశాడు, కొన్ని సార్లు బెదరించాడు అని సిమోనె షెఫీల్డ్ తెలిపారు.

ఇలాంటి వారిని ఊరికే వదిలేయ కూడదు

ఇలాంటి వారిని ఊరికే వదిలేయ కూడదు

హార్వే వెయిన్‌స్టన్‌ లాంటి వారిని ఊరికే వదిలేయ కూడదు అంటున్న సిమోనె షెఫీల్డ్ ఒక్కో హీరోయిన్ తమకు జరిగిన అన్యాయాన్ని బ‌య‌ట పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియానే మన ఆయుధం, పోరాడుదాం

సోషల్ మీడియానే మన ఆయుధం, పోరాడుదాం

హార్వే వెయిన్‌స్టన్‌ లాంటి వారి నిజస్వరూపాన్ని అందరికీ తెలిసేలా చేయడానికి సోషల్ మీడియా మంచి ఆయుధం, అతడికి వ్యతిరేకంగా అందరం గొంతు కలుపుదాం అని సిమోనె షెఫీల్డ్ పిలుపునిచ్చారు.

English summary
Talent manager, Simone Sheffield, was quoted in the report as saying, “I used to manage Indian actress Aishwarya Rai. While dealing with Harvey I found it comical how hard he tried to get Aishwarya alone."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu