»   » మరో అద్భుత 3-డి మాయాజాలం: వివాదాల మయం..!!

మరో అద్భుత 3-డి మాయాజాలం: వివాదాల మయం..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రతిష్టాత్మక డిస్నీ సంస్థ రూపొందించిన అద్భుత 3-డి మాయాజాలం "అలైస్ ఇన్ వండర్ ల్యాండ్" సినిమా మార్చి 5వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోన్న సంగతి తెలిసిందే. అవతార్ సినిమా అద్భుత విజయం తర్వాత రాబోతున్న ఈ 3-డి సినిమా పై మంచి అంచనాలు వున్నాయి. జానీ డెప్ వంటి సెక్సీ నటుడు నటిస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

కానీ ఈ సినిమా విడుదలకు ముందే వివాదం తలెత్తింది. ఈ సినిమాను బాయ్ కాట్ చేస్తామని థియేటర్ వర్గాలు బెదిరిస్తున్నాయి. ఈ సినిమా ప్రీమియర్ షోను కూడా అడ్డుకొనేందుకు వారు ప్రయత్నించారు. దీనికి కారణం ఈ సినిమా డివిడిని త్వరాగా మార్కెట్ లోకి విడుదల చెయ్యాలని డిస్నీ సంస్థ భావించడమే. సాధారణంగా సినిమా విడుదలయిన 17 వారాల తర్వాత డివిడిని విడుదల చెయ్యాలి కానీ ఈ సినిమా డివిడిని సినిమా విడుదలయిన 12 వారాలకే మార్కెట్ లోకి విడుదల చెయ్యాలని డిస్నీ సంస్థ తీర్మాణం చేసింది. దీంతో ఈ నిర్ణయం తమకు నష్టం చేకూరుస్తుందని థియేటర్ వర్గాలు ఆందోళన చేపట్టాయి. మరి డిస్నీ సంస్థ తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటుందో లేక తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందో చూడాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu