»   » ఈ వారం టాప్ సినిమా ఏదంటే...

ఈ వారం టాప్ సినిమా ఏదంటే...

Subscribe to Filmibeat Telugu

టిమ్ బుర్టాన్ సృష్టించిన అద్భుత మాయాలోకం "అలైస్ ఇన్ వండర్ ల్యాండ్". 3డి లో రూపొందిన ఈ సినిమా గత వారం విడుదలయి వరుసగా రెండవ సారి బాక్సాఫీసు వద్ద తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది. గత వారం మొత్తంగా 6.05 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఈ సినిమా ఈ ఘనతను సంపాదించింది. ఇక ఈ సినిమా 2010వ సంవత్సరంలో 200 మిలియన్ డాలర్ల పైచిలుకు వసూలు చేసిన తొలి సినిమాగా నమోదయింది. ఆ తర్వాత "గ్రీన్ జోన్" సినిమా 1.23 మిలియన్ డాలర్ల వసూళ్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ సినిమా ఇరాక్ యుద్ధనేపథ్యంలో రూపొందింది.

మూడవ స్థానంలో కామెడీ ఎంటర్టెయినర్ షి ఈజ్ అవుట్ ఆఫ్ మై లీగ్ సినిమా నిలిచింది. ఈ సినిమా 1.14 మిలియన్ డాలర్లు రాబట్టి ఈ ఘనతను పొందింది. ఇక నాల్గవ స్థానంలో లినార్డినో డి కాప్రియో నటించిన షట్టర్ ఐస్ ల్యాండ్ నిలవగా, ఐదవ స్థానంలో జేమ్స్ కామెరూన్ సాంకేతిక మాయాజాలం అవతార్ నిలిచింది. ఈ వారం అవతార్ సినిమా మరో సారి టాప్ ఐదు సినిమాల్లో చోటు సంపాదించుకోవడం విశేషం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu