»   » షాకింగ్: భార్యను చంపాలని ప్రయత్నించిన స్టార్ హీరో!

షాకింగ్: భార్యను చంపాలని ప్రయత్నించిన స్టార్ హీరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్: హాలీవుడ్ సినిమాలు చూసే వారికి జానీ డెప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. హాలీవుడ్లో 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' సిరీస్ చిత్రాలతో పాటు 'ఏలిస్ ఇన్ వండర్ ల్యాండ్' సహా చాలా చిత్రాల్లో ఆయన నటించారు.

జానీ డెప్ మీద తాజాగా షాకింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన భార్య, హాలీవుడ్ నటి అంబర్ హర్డ్ ను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపాలని ప్రయత్నించినట్లు తేలింది. జానీ డెప్ నుండి తనకు విడాకులు కావాలని లంబర్ కోర్టుకెక్కింది. అంతకు ముందే ఆమె తన తన భర్తపై గృహహింస కేసు పెట్టింది.

Johny

జానీ డెప్...అంబర్ ను చంపడానికి ప్రయత్నించిన సమయంలో భయబ్రాంతులకు గురైన ఆమె తన స్నేహితుడొకరికి ఈ విషయాన్ని చెబుతూ మెసేజ్ చేసింది. తాజాగా వీరిద్దరూ విడాకుల కోసం కోర్టు కెక్కిన నేపథ్యంలో ఆమె స్నేహితుడు న్యూయార్క్ పోస్టు అనే పత్రికకు ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు.

'మెసేజ్ వచ్చిన వెంటనే నేను ఆమె అపార్టుమెంటుకు వెళ్లాను. అక్కడ ఆమె ముఖంపై కమిలిన గాయాలు కనిపించాయి. పెదవిపై గాయమైంది. కన్ను ప్రాంతంలో కొట్టడంతో ఆ వైపు వాచిపోయింది. జుట్టు ఊడిపోయి కనిపించింది. ఆమె పరిస్థితి చూసి నేను షాకయ్యాను' అంటూ సదరు వ్యక్తి మీడియాకు తెలిపారు.

జానీ డెప్ చాలా క్రూరుడని, భార్యను ఎప్పుడూ తీవ్రంగా హింసిస్తూ ఉండేవాడని, అలాంటి వ్యక్తితో కలిసి ఉండటం కంటే విడాకులు తీసుకోవడమే మంచిందంటూ...ఈ సంఘటన అనంతరం అంబర్ కు మద్దతు పెరుగుతోంది.

English summary
We has exclusively obtained never-before-seen text messages that a source says are between Amber Heard and a man purported to be Johnny Depp's assistant, Stephen Deuters, that date back to before the estranged couple was married -- and long before other alleged incidents Heard previously detailed in court records claiming that Depp was physically abusive with her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X