»   » తాగి కొట్టిన స్టార్ హీరో, వీడియోలు చూపి విడాకులు, భరణం డబ్బుని సైతం...

తాగి కొట్టిన స్టార్ హీరో, వీడియోలు చూపి విడాకులు, భరణం డబ్బుని సైతం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాలిఫోర్నియా: ఎంత స్టార్ హీరో అయినా కొడితే ఎవరు పడి ఉంటారు. అందులోనూ తాగి వచ్చి రోజూ చితకొడుతూంటే ఎదురు తిరగాలి అనిపిస్తుంది. అయితే ఆ కసిని మనస్సులో పెట్టుకుని పెద్ద మొత్తంలో భరణం సొమ్ములాగి, దాన్ని తన లాగ భాధపడేవారికి, ఛారిటీలకు ఇచ్చి కసి తీర్చుకుందామె.

ఈ స్టోరీ ఎవరి గురించి, ఎవరా స్టార్ హీరో అంటారా..ఇంకెవరు మనకందరికీ తెలుసున్న హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ గురించి. అవును.. పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సిరీస్ లో కెప్టెన్ జాక్ స్పారో పాత్రలో విభిన్న శైలిలో నటించి మెప్పించిన డెప్ గురించే ఇదంతా.

కిందటేడాది ఫిబ్రవరిలో, మూడేళ్ల రొమాంటిక్‌ డేట్స్‌ తర్వాత జానీడెప్ వివాహమాడిన యాంబర్‌ హెర్డ్‌, ఇప్పుడు విడాకులు కావాలంటూ కోర్టుకెక్కింది. తనను డెప్‌ ఇంట్లో చావగొడుతున్నాడనీ, ఈ మధ్యనే తన సెల్‌ఫోన్‌ను విసిరి, నుదుటి మీద గాయం చేశాడనీ ఆమె అభియోగం. చివరకు విడాకలు అయ్యాయి.

అయితే కోర్టులో విషయం నడుస్తున్నప్పుడు.. యాంబర్ మీదనే నిందలు వేశాడు జానీ డెప్. వాటిన్నటినీ తట్టుకోలేకపోయిందో మరేమో కానీ .. ఇప్పుడు జానీ డెప్ ఈ అమ్మడును కొడుతున్న రెండు మూడు వీడియోలు బయటకు వచ్చేశాయి.

వాటినే సాక్ష్యాలుగా పరిగణిస్తూ కోర్టు దాదాపు డైవర్స్ ఖరారుచేసినట్లే. ఇకపోతే భరణం క్రింద యాంబర్ హర్డ్ ఏకంగా 7 మిలియన్ డాలర్లు (దాదాపు 45 కోట్లు) తీసుకుంటోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే.. ఈ 7 మిలియన్లు చేతికి అందగానే వాటిని యథాతథంగ ఒక చారిటీ సంస్థకు ఇచ్చేస్తోంది. చారిటీకి ఇచ్చేయడానికి కావల్సిన పత్రాలను కూడా సైన్ చేసింది యాంబర్.

ఈ కథకు ముందు తెర వెనక ఏం జరిగింది..వంటి మరిన్ని వివరాలు స్లైడ్ షోలో

అప్పుడే..

అప్పుడే..

యాంబర్‌ హెర్డ్‌ను జానీడెప్‌, 2011లో జరిగిన ‘రమ్‌ డెయిరీ' అనే ఫిల్మ్‌ షూటింగ్‌ సమయంలో కలుసుకున్నాడు.

ఆ చిత్రంలో...

ఆ చిత్రంలో...

డెప్‌ ఒక బిజినెస్‌మ్యాన్‌ ఫియాన్సీగా యాంబర్ నటించింది.

తెర వెనక

తెర వెనక


వీరిద్దరి మధ్యా రొమాన్స్‌ పెరిగి, చివరికి వారిద్దరూ ఏకం కావటం ఆ సినిమా కథ. అదే నిజ జీవితంలోనూ జరిగింది.

పెళ్లిదాకా

పెళ్లిదాకా


హంటర్‌ ఎస్‌. థాంప్సన్‌ రాసిన అదే పేరున్న నవల ఆధారంగా నిర్మితమయిన ఆ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యేసరికి వీరిద్దరి రొమాంటిక్‌ స్టోరీ కూడా పూర్తయి, వివాహ వేదిక వరకూ వచ్చింది.

కోర్టుకి

కోర్టుకి


కాగా హాలీవుడ్ స్టార్ జానీ డెప్ అంబర్ హార్డ్ ను పెళ్లాడి సంవత్సరంన్నర తిరగకుండానే విడాకులు తీసేసుకుని వార్తలకెక్కారు.

గృహ హింస

గృహ హింస


భర్తపై యాంబర్ గృహహింస ఆరోపణలు చేయడంతో, తీవ్రమైన విభేదాలు నెలకొన్నాయని తెలపడంతో .. వీరి విడాకులకు స్థానిక కోర్టు అంగీకారం తెలిపింది.

సాక్ష్యాలు సైతం

సాక్ష్యాలు సైతం


ఈ వ్యవహారంలో కోర్టు ముందు హాజరైన యాంబర్ ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటోలను సాక్ష్యాలుగా తాజాగా లాస్ ఏంజెల్స్ లోని సుపీరియర్ కోర్టుకు సమర్పించింది.

వంద అడుగులు

వంద అడుగులు


సాక్ష్యాలను పరిశీలించిన మీదట ఆమె నివాసానికి 100 అడుగులు దూరంలో ఉండాలంటూ జానీ డెప్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం ...

అనంతరం ...

యాంబర్ ఈ వివాదంలో తొలిసారి మీడియాతో ముందు నోరు విప్పింది. పెళ్లయిన దగ్గర్నించీ, తనను మానసికంగా, శారీరకంగా వేధించేవాడని అంబర్ వాపోయింది.

రోజూ కొట్టేవాడు

రోజూ కొట్టేవాడు


బాగా మద్యం సేవించి తనపై దాడిచేసేవాడని.. నిత్యం భయంతో బిక్కచచ్చిపోతూ బతికేదాన్నని తెలిపింది.

 తాగి కొట్టిన స్టార్ హీరో, వీడియోలు చూపి విడాకులు, భరణం డబ్బుని సైతం...

తాగి కొట్టిన స్టార్ హీరో, వీడియోలు చూపి విడాకులు, భరణం డబ్బుని సైతం...

కన్నీంటిపర్యంతమైంది విపరీతంగా మద్యం సేవించి.. తనపై చేయి చేసుకున్నాడని.. జుట్టుపట్టిలాడి ఈడ్చేశాడనీ, మొఖంపై కొట్టాడని ఆరోపించింది.

అయితే

అయితే

భార్య ఆరోపణలను కొట్టి పారేసిన డెప్ లాయర్ కోర్టు ముందు కౌంటర్ వాదనలు దాఖలు చేశాడు. డబ్బుకోసమే ఆ ఆరోపణలు చేస్తోందని విమర్శించాడు.

అయితే అవేమీ

అయితే అవేమీ

కానీ డెప్ వాదనలు ఏమీ నిలవలేదు..కోర్టు కొట్టేసింది. ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఇబ్బందే

ఇబ్బందే

మూడేళ్లు ప్రేమించుకుని అట్టహాసంగా పెళ్లి చేసుకున్న హాలీవుడ్ జంట కాపురం మూడ్నాళ్ల ముచ్చటే అవటం బాధాకరమే

దారుణం

దారుణం


దాదాపు పెళ్లైన 15 నెలలకే పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్' సూపర్ హిట్ సిరీస్ హీరో జానీ డెప్ (52) యాంబర్ హార్డ్‌ (30) జంట రచ్చకెక్కటం దారుణం

English summary
ఎంత స్టార్ హీరో అయినా కొడితే ఎవరు పడి ఉంటారు. అందులోనూ తాగి వచ్చి రోజూ చితకొడుతూంటే ఎదురు తిరగాలి అనిపిస్తుంది. అయితే ఆ కసిని మనస్సులో పెట్టుకుని పెద్ద మొత్తంలో భరణం సొమ్ములాగి, దాన్ని తన లాగ భాధపడేవారికి, ఛారిటీలకు ఇచ్చి కసి తీర్చుకుందామె.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu