»   » నాకు భర్తే కావాలి, నోరువిప్పిన స్టార్ హీరో భార్య: ఇక విడాకులు లేనట్టేనా, అభిమానుల ఆనందం

నాకు భర్తే కావాలి, నోరువిప్పిన స్టార్ హీరో భార్య: ఇక విడాకులు లేనట్టేనా, అభిమానుల ఆనందం

Posted By:
Subscribe to Filmibeat Telugu

పన్నెండేళ్ల ప్రేమ బంధానికి, రెండున్నరేళ్ల వైవాహిక బంధానికి హాలీవుడ్ స్టార్ జంట ఏంజెలీనా జోలీ(41), ఆస్కార్ ఆవార్డు విజేత బ్రాడ్ పిట్ (52) స్వస్తి చెబుతున్నారన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా వారిద్దరి అభిమానులకి షాక్ లా తగిలింది..

2004 నుంచి ప్రేమ బంధంతో కలిసి జీవించిన వీరిద్దరూ 2014లో వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఆరుగురు పిల్లలు. ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకోగా, ముగ్గురు పిల్లలు వీరి దాంపత్యానికి చిహ్నంగా పుట్టారు. ఎన్నో ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జంట హాలీవుడ్ లో 'మోస్ట్ అడోరబుల్ కపుల్'గా పేరుతెచ్చుకుంది.

పన్నెండేళ్లకు పైగా బంధం

పన్నెండేళ్లకు పైగా బంధం

పాశ్చాత్య దేశాల్లో పెళ్లిల్లు, విడాకులు సాధారణమే. పైగా రంగుల ప్రపంచమైన హాలీవుడ్‌లో మరింత సాధారణం. అయితే పన్నెండేళ్లకు పైగా బంధం, అరడజను మందికి పైగా పిల్లలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు.. ఇలా హాలీవుడ్‌లోనే అత్యంత ఆదర్శవంతమైన జంటగా నిలిచారు ఏంజెలినా జోలీ, బ్రాడ్‌ పిట్‌ దంపతులు. ఇన్నాళ్లకు వారి బంధానికి కూడా బీటలు పడుతున్నాయి. ఏంజెలినా తన భర్త బ్రాడ్‌పిట్‌తో విడిపోవాలని నిర్ణయించుకుంది. కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకుంది.

Priyanka Chopra making over herself to sustain in hollywood
కొన్ని నెలల క్రితమే

కొన్ని నెలల క్రితమే

జోలీ, బ్రాడ్‌ మధ్య విభేదాలు తలెత్తాయని కొన్ని నెలల క్రితమే అక్కడి పత్రికలు కథనాలు వండివార్చాయి. అయితే వారి బంధం గురించి తెలిసినవారెవరూ ఆ వార్తలను నమ్మలేదు. అయితే ఆ వార్తలు ఆ తర్వాత నిజమయ్యాయి.ఎంతగానో ప్రేమించిన భర్తతో విడాకుల కారణంగా జోలీ శారీరకంగా, మానసికంగా చాలా బలహీనంగా మారిపోయినట్టు తెలుస్తోంది.

ఎముకల గూడులా మారిపోయింది

ఎముకల గూడులా మారిపోయింది

గత మార్చిలో తన పిల్లలతో కలిసి బయటకు వచ్చిన జోలీ దాదాపు ఎముకల గూడులా మారిపోయింది. ఈ పరిస్థితి నుంచి జోలీ బయటపడడం కష్టమేనని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, జోలీ, బ్రాడ్‌ విడాకుల తీసుకుంటుండడంపై.. బ్రాడ్‌ మాజీ భార్య జెన్నీఫర్‌ ఆనిస్టిన్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

తన కుటుంబ క్షేమం కోరి

తన కుటుంబ క్షేమం కోరి

అయితే, బ్రాట్ పిట్ వ్యవహారశైలితో విసిగిపోయిన ఏంజెలీనా జోలీ అతని నుంచి విడిపోవడమే మేలు అని భావించింది. దీంతో అటార్న్ రాబర్ట్ వద్ద విడాకులు దరఖాస్తు చేసుకొంది. తన కుటుంబ క్షేమం కోరి తానీ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. దీనిని బ్రాడ్ పిట్ కూడా నిర్ధారించడం విశేషం. విడాకులు తీసుకుంటున్నామని చెప్పడం బాధగా ఉందని తెలిపాడు. అయితే తమిద్దరి చుట్టూ చోటుచేసుకున్న కొన్ని పరిణామాల కారణంగా ఇలాంటి పరిస్థితి చోటుచేసుకుందని భాదపడ్డాడు.

డైవ‌ర్స్‌కు బ్రేక్ వేయాల‌నుకుంటున్న‌ది

డైవ‌ర్స్‌కు బ్రేక్ వేయాల‌నుకుంటున్న‌ది

అయితే ఇప్పుడు ఏంజిలినా మ‌న‌సు మార్చుకున్న‌ది. త‌న భ‌ర్త బ్రాడ్ పిట్‌కు ఇచ్చిన విడాకుల నోటీసును ఆమె వెన‌క్కి తీసుకోవాల‌నుకుంటున్న‌ది. తాను చేసిన పొర‌పాటును తెలుసుకున్న జోలీ ఇప్పుడు త‌న డైవ‌ర్స్‌కు బ్రేక్ వేయాల‌నుకుంటున్న‌ది. కోపంలో తీసుకున్న నిర్ణ‌యాన్ని క్ష‌మాగుణంతో వెన‌క్కి తీసుకునేందుకు జోలీ రెడీ అయిన‌ట్లు టాక్‌.

మ‌న‌సు మారిన‌ట్టే

మ‌న‌సు మారిన‌ట్టే

నిజానికి నోటీసు ఇచ్చిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మ‌ళ్లీ జోలీ ఎటువంటి న్యాయ‌ప‌ర‌మైన ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. విడాకుల కేసు కొద్దిగా కూడా ముందుకు సాగ‌లేదు. అయితే బ్రాడ్‌పై మ‌న‌సు మారిన‌ట్లు తాజాగా వానిటీ ఫెయిర్ మ్యాగ్జిన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జోలీ త‌న‌ అభిప్రాయాన్నివ్య‌క్తం చేసింది. కోపం త‌గ్గింద‌ని, బ్రాడ్ కావాల‌నుకుంటున్న‌ట్లు జోలీ ఆ ప‌త్రిక‌తో చెప్పింది.

English summary
The divorce - which has played out amidst tremendous acrimony Between Angelina and Brad, might not happen after all.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu