»   » ఆమె 'నైలాన్ దారంలా కనిపించే నాగుపాము'..!

ఆమె 'నైలాన్ దారంలా కనిపించే నాగుపాము'..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హాలీవుడ్ నటి, ప్రపంచ అందగత్తెల్లో ఒకరయిన ఏంజలీనా జోలీ మంచి నటి మాత్రమే కాదు ఎంతో మందికి సాయం చేసి మంచి మనిషి అని కూడా అనిపించుకుంది. కానీ ఆమె బయటకు మంచిగా కనిపంచే ఓ సైకో అని ఆమెకు బాడీగార్డ్ గా పనిచేసిన బిల్ వ్యాఖ్యానించాడు. టచ్ వీక్లీ మ్యాగ్జయిన్ తో మాట్లాడిన ఆయన ఆమె గురించిన ఎన్నో విషయాలు వెళ్లడించాడు.

ఆమె పబ్లిక్ లో వున్నప్పుడు ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడ ఒకలాగా ప్రవర్తిస్తుందని ఆయన వ్యాఖ్యానించాడు. ఇక ఆమెకు ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుందని, కోపం వచ్చినప్పుడు ఆమెను నిలువరించడం ఎవరి తరమూ కాదని బుసకొట్టే త్రాచుపాములా మీదకు ఎగురుతుందని..పాపం ఆమె పిల్లలు, బ్రాడ్ పిట్ ఆమె కోపానికి ప్రతిరోజూ బలవుతూ వుంటారని ఆయన వ్యాఖ్యానించాడు.

ఆమె బ్రడ్ పిట్ ను ఏమాత్రం నమ్మదని, ప్రతి నిమిషం అనుమానిస్తూ వుంటుందని కూడా ఆయన చెప్పాడు. సెట్స్ లో ఉన్నప్పుడు బ్రడ్ కు ఫోన్ చేసి గట్టిగా అరుస్తూ తిట్టిపోస్తూ వుంటుంది. ఆమె కోపాన్ని భరించలేక బ్రడ్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పక్కకు వెళ్లిపోతాడని, కానీ ఆ తర్వాత ఫోన్ కట్టేసి మళ్లీ ఎవరో ఒకరు ఫోన్ తీసే వరకూ ఆపకుండా ఫోన్ చేస్తూనే వుంటుందని చేప్పారు. ఇక జోలీకి ఖచ్చితంగా ఓ మానసిక వైధ్యుడి సాయం అవసరమని ఆయన ఓ ఉచిత సలహాను పడేసాడు. ఇక జోలీ-బ్రాడ్ పిట్ లు ప్రస్తుతం వెనీస్ నగరంలో వున్నారు. జోలీ తాజా సినిమా ది టూరిస్ట్ సినిమా షూటింగ్ అక్కడే జరుగుతుండటంతో కుటుంబం మొత్తం అక్కడికి చేరుకుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu