»   » దర్శకురాలిగా మారుతున్న మెగా స్టార్ హీరోయిన్..అందరూ షాక్

దర్శకురాలిగా మారుతున్న మెగా స్టార్ హీరోయిన్..అందరూ షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ మెగా స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ దర్శకురాలి మారబోతోంది.అలాగే ఆమె డైరెక్ట్ చేయబోతున్నది అలాంటి ఇలాంటి సినిమా కాదు..రెగ్యులర్ కి భిన్నంగా సాగే ఓ సీరియస్ యాక్షన్ సినిమా. దాని పేరు 'ఇన్ ద లాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హనీ'.ఎప్పుడూ జోవియల్ గా ఉండి, నటనలో పరకాయ ప్రవేశం చేసే ఆమె ఇలా ఒక్కసారిగా డైరక్టర్ అవతారం ఎత్తి అలాంటి సీరియస్ చిత్రం చేయటం హాలీవుడ్ ప్రముఖులను షాక్ చేస్తోంది.మొదట్లో ఈ విషయాన్ని రూమర్ అని కొట్టిపారేశినా ఆ తర్వాత ఆమె టైటిల్,రిలీజ్ డేట్ ప్రకటించి,షూటింగ్ మొదల పెట్టనుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. "ఈ సినిమా కథకి నేపథ్యం బోస్నియా యుద్ధం. అయినా ఈ కథ సార్వజనీనం. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో నివసించే ప్రజల మధ్య మానవ సంబంధాలు, ప్రవర్తన ఎలా గాఢంగా ఆ యుద్ధానికి ప్రభావితమవుతాయో ఈ సినిమా ద్వారా చెప్పాలనుకుంటున్నా అంటోంది.ఇక ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం నిరాశపరచదని నిర్మాత గ్రాహమ్ కింగ్ వాగ్ధానం చేస్తున్నాడు.ఈ చిత్రం డిసెంబర్ 23,2011 విడుదల కాబోతోంది.

English summary
The directorial debut of Angelina Jolie now has a title and release date.In the Land of Blood and Honey will be released by Film District on 23rd December 2011. Said to be a romance set during the Bosnian War, Jolie was strictly behind the camera for her first film as director, recruiting a local cast of unknowns.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu