For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా "జోలికి" కి రాకు...! నువ్వు "బ్రాడ్" కాదు న్యారో...! విడాకులు తీసుకోనున్న హీరో హీరోయిన్ జంట

  |

  2004 నుంచి కలిసి ఉంటున్న బ్రాడ్‌-జోలీ 2014లో వివాహం చేసుకున్నారు. 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ స్మిత్‌' సెట్స్‌లో కలుసుకున్న వీరు ప్రేమలో పడ్డారు. హాలీవుడ్‌లో మోస్ట్‌ రొమాంటిక్‌ కపుల్‌గా వీరికి గుర్తింపు ఉంది. ఎంజిలినా జోలి బ్రాడ్ పిట్‌తో దాదాపు 11 సంవత్సరాలు కలిసి వుంది. రెండేళ్ళ క్రితమే వీరిద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. ఆదర్శ జంటగా పేరు తెచ్చుకున్న వీరిమధ్య ఇప్పుడు విభేదాలు తలెత్తాయి.

  దానికి కారణం బ్రాడ్ పిట్ మరో నటితో సంబంధం పెట్టుకోవడమే. బ్రాడ్ ఫిట్ స‌హ‌ న‌టి 'మారియ‌న్'తో డేటింగ్ లో ఉన్న‌ట్లు కూడా ప్ర‌చారంలో ఉంది. ఈ విష‌యం గ్ర‌హించిన ఎంజ‌లీనా కూడా విడాకులు తీసుకుంటేనే మంచిద‌ని భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అలాగే ఎంజిలినా జోలి ఆరోగ్యం కూడా ఇప్పుడు బాగాలేదు. ఇటీవలే కాన్సర్ సోకడంతో ఆమె రెండు వక్షోజాలను కూడా తొలగించారు. దాంతో సమస్య ఇంకా పెద్దదైందట.

  గత మార్చిలో బ్రాడ్ పిట్‌ ఒక్కడే తమ పిల్లలు పాక్స్, జాహరా, మడొక్స్, షిల్హా, నాక్స్‌, వివియెన్నెలతో కలిసి షాపింగ్ చేస్తూ కనిపించడం.. వీరి బ్రేకప్‌ కు నిదర్శనంగా గతంలో కథనాలు వచ్చాయి. జోలీ తన డైరీలో రాసుకున్న వ్యక్తిగత నిజాలను పిట్ చదువడం వల్లే వీరి మధ్య విభేదాలు మొదలైనట్లు ఈ కథనాల సారాంశం. ఆమె గత జీవితానికి సంబంధించిన సమస్యలు మళ్లీ వెలుగుచూడటంతో, ఆమె చిత్రంగా ప్రవర్తిస్తుండటంతో బ్రాడ్ పిట్‌ జోలీకి దూరమవుతున్నట్టు ద నేషనల్ ఎంక్వైరెర్ పత్రిక గతంలో పేర్కొంది.

  Angelina Jolie files for divorce from Brad Pitt

  పిట్‌తో అనుబంధం నానాటికీ సన్నగిల్లుతుండటంతో ఆమె బేలగా, నీరసంగా మారిపోయిందని, గత మార్చిలో లండన్‌లో తన పిల్లలతో బయటకొచ్చిన జోలీ 'ఎముకల గూడు'లా కనిపించడంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్నదని 'టచ్ మ్యాగజీన్' తెలిపింది. పిట్‌తో గొడవలు, వ్యవహారం విడాకుల దాకా వెళుతుండటంతో జోలీ చాలా నీరసంగా మారిపోయి మరింత బరువు తగ్గిపోయిందని, తీవ్ర ఒత్తిడిలో భావోద్వేగానికి లోనవుతున్న ఆమె శారీరకంగా, మానసికంగా బ్రేక్‌డౌన్ అయ్యేలా కనిపిస్తున్నదని ఆ మ్యాగజీన్ పేర్కొంది. ఈ పరిస్థితిలో జోలీకి సహాయపడటం కానీ, తమ వైవాహిక బంధాన్ని నిలుపుకోవడానికిగానీ బ్రాడ్ పిట్ ప్రయత్నించడం లేదని చెప్పింది. అయితే ఈ కథనాలపై గతంలో ఈ దంపతులు పెదవి విప్పలేదు.

  కాబట్టి విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యారట. బ్రాడ్ పిట్ మరో నటి మారియన్‌కు దగ్గర కావడంతో తట్టుకోలేని ఏంజిలినా విడాకుల కోసం సిద్ధమైంది. వారి విడాకుల విలువ 400 అమెరికన్ మిలియన్ డాలర్స్? అంటే మన ఇండియన్ కరెన్సీలో 2500 కోట్లు అన్నమాట? అవార్డ్స్‌ ఫంక్షన్‌-పబ్లిక్‌ మీటింగ్‌ ఏదైనా బ్రాడ్‌-జోలీ అక్కడున్నారంటే అందరి కళ్లూ వీరిపైనే. ఈ విషయంలో వీరి మధ్య విబేధాలు తీవ్రరూపం దాల్చాయని, రాజీకి వచ్చే ప్రసక్తి లేకపోవడంతోనే జోలీ డైవోర్స్‌కు ఫైల్‌ చేశారని అంటున్నారు. సెప్టెంబర్‌ 15 నుంచి వీరు విడిపోయినట్లుగా విడాకుల పత్రంలో పేర్కొన్నారు. 12ఏళ్లు విజయవంతంగా సాగిన వీరి రిలేషన్‌షిప్‌ ఇలా ముక్కలైపోవడం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది.

  English summary
  Angelina Jolie has filed for divorce from Brad Pitt, her attorney has said. “This decision was made for the health of the family. She will not be commenting, and asks that the family be given its privacy at this time,” Robert Offer said in a statement
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X