»   » రొమ్ముల తొలగింపు తర్వాత ఏంజలీనా జోలీ ఇలా..

రొమ్ముల తొలగింపు తర్వాత ఏంజలీనా జోలీ ఇలా..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Angelina Jolie and Brad Pitt
లండన్ : రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండటంతో హాలీవుడ్ హాట్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ తన రెండు రొమ్ములను సర్జరీ ద్వారా తొలగించుకున్న సంగతి తెలిసిందే. సర్జరీ తర్వాత ఆమె తొలిసారిగా తన భర్త బ్రాడ్ ఫిట్‌తో కలిసి పబ్లిక్‌లోకి వచ్చారు. బ్రాడ్ ఫిట్ నటించిన మూవీ 'వరల్డ్ వార్ జెడ్' ప్రీమియర్ షో ఆదివారం లండన్లో జరుగడంతో ఆమె హాజరయ్యారు.

37 ఏళ్ల ఏంజెలీనా జోలీ ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అభిమానులకు అభివాదం చేస్తూ....వారికి ఆటోగ్రాఫులు ఇస్తూ చాలా సరదాగా కనిపించారు. సర్జరీ తర్వాత కూడా ఆమె ఎంతో అందంగా, కాన్ఫిడెన్స్‌గా కనిపించిందని అంటున్నారు ఆమె అభిమానులు.

ఈ సందర్భంగా ఏంజెలీనా జోలీ మాట్లాడుతూ...'మహిళ ఆరోగ్యం గురించి ఇప్పుడు అన్ని చోట్లా చర్చ జరుగుతోంది. చాలా ఆనందంగా ఉంది. అందులో నా ప్రస్తావన కూడా ఉంది. కాన్సర్ కారణంగా నా తల్లిని కోల్పోయాను. ఇప్పుడు అదే సమస్య నేను ఎదుర్కొన్నాను. నాకు ప్రజల నుంచి మద్దతు లభించడం గొప్పగా ఫీలవుతున్నాను' అని వ్యాఖ్యానించింది.

ఏంజెలీనా జోలీ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవడానికి మూల కారణం ఆమె అత్తగారు జానె పిట్. ఏంజెలీనా జోలీ తల్లికి క్యాన్సర్ ఉందన్న విషయం తెలిసి....ఏంజెలీనా కూడా ముందస్తు టెస్టులు చేయించుకునేలా ఆమె ఒప్పించిందట. టెస్టుల తర్వాత ఏంజెలీనా జోలికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 87 శాతం ఉందని, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం 50 శాతం ఉందని తేలింది.

English summary
London: Actress Angelina Jolie made her first public appearance after her double mastectomy surgery and beamed with confidence as she stood next to her partner Brad Pitt on the red carpet. Jolie came to attend the premiere of Pitt's forthcoming movie World War Z Sunday here.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu