»   » ఆమె చలవతో స్కూలుకెళ్తున్న ఆఫ్ఘన్ బాలికలు

ఆమె చలవతో స్కూలుకెళ్తున్న ఆఫ్ఘన్ బాలికలు

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హాలీవుడ్ అందాల నటి ఏంజలీనా జోలీకి సేవా మార్గం అంటే చాలా ఇష్టం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఐఖ్యరాజ్య సమితి గుడ్ విల్ అంబాసిడర్ గా కొనసాగుతున్న ఆమె 2008వ సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ లో పర్యటించినప్పుడు అక్కడ బాలికల కష్టాలను చూసి చలించిపోయారు. దీంతో వారికి తన వంతు సాయంగా ఓ స్కూలును ఏర్పాటు చెయ్యడానికి 75 వేల డాలర్లను విరాళంగా అందించింది. దీంతో అక్కడో ఆధునికమయిన... అన్ని వసతులు గల పాఠశాల వెలిసింది. ఈ పాఠశాల వచ్చే సోమవారం నుండీ ప్రారంభం కానుంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఏంజలీనా జోలీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఏంజలీనా చలవతో తమ పిల్లలు స్కూలుకు వెలుతున్నారని తెగ సంబరపడిపోతున్నారు.

కాగా మనదేశం నుండీ ఇటీవలే మాస్టర్ బ్లాష్టర్ సచిన్ టెండూల్కర్ యుఎన్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. మరి పేదప్రజల కోసం ఈయన ఏం చెయ్యనున్నాడో....

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu