twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏంజెలినా జోలికి కాన్సర్..రెండు రొమ్ములు తొలిగింపు

    By Srikanya
    |

    వాషింగ్టన్‌: హాలీవుడ్ స్టార్ హీరోయిన్,ఆస్కార్ అవార్డు గ్రహీత ఏంజెలినా జోలి (37) కి రొమ్ము కాన్సర్ ప్రభావంతో వైద్యులు రెండు రొమ్ములును తొలగించారు. ఆ స్థానంలో కృత్రిమ రొమ్ములను ఏర్పాటు చేశారు. సాధారణంగా చాలామంది ఇటువంటి 'వ్యక్తిగత' అంశాల్ని బయటికి ఎంతమాత్రం వెల్లడించటానికి ఇష్టపడరు. కానీ, ఈ విషయాల్ని జోలీ స్వయంగా వెల్లడించారు.

    ఏంజెలినా జోలి జన్యుపరంగా తనకు రొమ్ము కేన్సర్‌ రొమ్ము కేన్సర్‌ సోకే ప్రమాదం ఉందని తేలటంతో ఏంజెలినాజోలి రెండు రొమ్ములను తొలగించుకున్నారు (దీనిని వైద్యశాస్త్రంలో డబుల్‌ మాస్టెక్టమీ అంటారు). వైద్యులు జోలీకి శస్త్రచికిత్స చేసి రొమ్ముల కణజాలాన్ని తీసివేశారు. తనలాగే రొమ్ము కేన్సర్‌ ప్రమాదాన్ని ఎదుర్కొనే మహిళలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మంగళవారం న్యూయార్క్‌టైమ్స్‌లో ఆమె 'మై మెడికల్‌ ఛాయిస్‌' శీర్షికతో ఒక వ్యాసం రాశారు.

    Angelina Jolie

    ఆ వ్యాసంలో... మా అమ్మ పదేళ్లపాటు కేన్సర్‌తో పోరాడి 56 ఏళ్ల వయసులో మరణించారు. నాలో బీఆర్‌సీఏ1 అనే జన్యువు ఉంది. దానివల్ల నాకు రొమ్ము కేన్సర్‌ వచ్చే ప్రమాదం 87 శాతం ఉందని, అండాశయ కేన్సర్‌ వచ్చే ప్రమాదం 50 శాతం ఉందని మా వైద్యులు అంచనా వేశారు. నాలో ఉన్న జన్యులోపం గురించి తెలిసిన తర్వాత డబుల్‌ మాస్టెక్టమీ శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నా. అండాశయ కేన్సర్‌కన్నా రొమ్ము కేన్సర్‌ ప్రమాదం ఎక్కువగా ఉండటంతో తొలుత దాని నివారణ కోసం ప్రయత్నాలు ప్రారంభించాను.

    ఫిబ్రవరి 2న చనుమొనల కింద ఉన్న కణజాలం పరీక్షతో వైద్యప్రక్రియ మొదలైంది. అక్కడ వ్యాధి లేదని తేలటంతో చనుమొనలను తొలగించాల్సిన అవసరం రాలేదు. రెండు వారాల తర్వాత ప్రధాన శస్త్రచికిత్స జరిగింది. రొమ్ము కణజాలాన్ని తొలగించి దానిస్థానంలో తాత్కాలిక ఫిల్లర్లు అమర్చారు. ఇది చూడటానికి సైన్స్‌ఫిక్షన్‌ సినిమాలా అనిపించినా.. కొన్ని రోజుల్లోనే సాధారణ జీవితానికి రాగలిగాను. తొమ్మిదివారాల తర్వాత రొమ్ముల పునర్నిర్మాణంతో చివరి శస్త్రచికిత్స కూడా పూర్తయింది. ఇప్పుడు రొమ్ముకేన్సర్‌ ప్రమాదం నాకు 87 శాతం నుంచి 5 శాతానికి తగ్గిపోయింది. అన్నారు.

    శస్త్రచికిత్సలు జరుగుతున్న సమయంలోనూ మధ్యలో లభించిన వ్యవధిలో ఏంజెలినా తన విధులను నిర్వర్తించారు. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారిగా ఉన్న ఆమె.. ఘర్షణలు చెలరేగే ప్రాంతాల్లో లైంగిక హింసకు వ్యతిరేకంగా ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రొమ్ము కేన్సర్‌ చికిత్స తీసుకుంటూనే ఆమె డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోకు వెళ్లారు.

    లండన్‌లో జరిగిన జీ-8 దేశాల విదేశాంగమంత్రుల సమావేశానికి హాజరయ్యారు. పాకిస్థాన్‌లో గత అక్టోబర్‌లో తాలిబన్ల చేతిలో హత్యకు గురైన మాలాల యూసఫాజయ్‌ నెలకొల్పిన బాలికల విద్యాసంస్థకు నిధులు సేకరించారు. ఏంజెలినా, బ్రాడ్‌పిట్‌లకు ముగ్గురు పిల్లలు. మరో ముగ్గురు అనాథ పిల్లలను వారు దత్తత తీసుకున్నారు.

    English summary
    Oscar-winning film star Angelina Jolie revealed on Tuesday that she underwent a double mastectomy after learning she had inherited a high risk of breast cancer and said she hoped her story would inspire other women fighting the life-threatening disease.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X