»   » మీకు క్రేజ్ రావాలంటే ఖచ్చితంగా అది కోయించుకోవాల్సిందే..!!

మీకు క్రేజ్ రావాలంటే ఖచ్చితంగా అది కోయించుకోవాల్సిందే..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచంలోనే అందగత్తెగా పేరొందిన ఏంజలీనా జోలీలో మీకు నచ్చినది ఏదని అడిగితే ఖచ్చితంగా 99.99% శాతం మంది ఆమె పెదాలు అని సమాధానం ఇస్తారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అంతగా ఆమె పెదాలు మనల్ని ఊరిస్తాయి. కానీ ఆమె పెదవుల వెనకో రహస్యం వుంది. అదే సర్జరీ రహస్యం. సర్జరీకి ముందు ఏంజలీనా పెదాలు ఇప్పుడున్నంత అందంగా ఏమీ లేవు. కానీ ఆమె సర్జరీ చేయించుకున్నాకా ఆమె పెదాలు సరికొత్త అందాన్ని సంతరించుకున్నాయి. ఎంతగా అంటే అందమైన పెదావులెలా వుండాలంటే దొండపండులా వుండాలనే వారు, ఏంజలీనా జోలీ పెదావుల్లా వుండాలని అనేంతగా ఆమె పెదావులు ఆకర్షించాయి. ఆ తర్వాతే ఆమెకున్న క్రేజి రెట్టింపయింది మరి.

ఈమె దారిలోనే నికోల్ కిద్మాన్ తన ముక్కును సర్జరీ చేయించుకొని క్రేజి పెంచుకుంది. జెస్సికా ఆల్బా, సాండ్రా బుల్లక్, జెన్నిఫర్ గార్నర్, బ్రిటానీ ముర్ఫి లాంటి వారు కూడా ఇదే జాబితాలో సర్జరీలతో క్రేజిపెంచేసుకున్నారు. కానీ ఈ సర్జరీలు ఎక్కువయినా అనర్థమే. దీనికి ఉత్తమ ఉదాహరణ మైఖేల్ జాక్సన్. ఆయన మృతి చెందిన తర్వాత మొత్తం శరీరంలో 51 కత్తిగాట్లు వున్నాయంటే ఆయనెన్ని సర్జరీలు చేయించుకున్నాడో అర్థమవుతుంది. ఈ సర్జరీల బాధ తట్టుకోలేకే ఆయన అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకొని మృతి చెందారు. అందుకే అన్నారు అతి సర్వత్రవర్జయత్ అని...!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu