»   » రాకాసి శాపం నుండీ యువరాణి ఎలా బయటపడింది..!?

రాకాసి శాపం నుండీ యువరాణి ఎలా బయటపడింది..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజలీనా జోలీ త్వరలో ఓ దెయ్యం పాత్రలో అలరించనుంది. ఇంతకు ముందు బివూల్ఫ్ అనే సినిమాలో దెయ్యం పాత్రలో నటించిన ఈమె తాజాగా డిస్నీ సంస్థ వారు రూపొందించబోయే స్లీపింగ్ బ్యూటీ అనే సినిమాలో నటించనుందనే వార్త హాలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ఇటీవలే విడుదలయి సూపర్ హిట్ అయిన అలైస్ ఇన్ వండర్ ల్యాండ్ సినిమా దర్శకుడు టిమ్ బుర్టన్ కూడా పనిచేయనున్నట్టు సమాచారం.

మెలిఫిసెంట్ అనే దెయ్యం పాత్రలో జోలీ నటించనుంది. ఈ పాత్ర సినిమాలో యువరాణి అరోరాను 16వ ఏటన చనిపోవాలని శపిస్తుంది. అరోరా నామకరణానికి తనని ఆహ్వానించలేదనే కోపంతో ఈమె యువరాణిని శపిస్తుంది. ఆ తర్వాత ఈ రాకాసి శాపం నుండీ యువరాణి ఎలా బటయపడింది అనేది సినిమా. డిస్నీ సినిమాల విలన్ గా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ పాత్రను ఏంజలీనా పోషిస్తే మరింతగా అందంగా వుంటుందనడంలో సందేహం లేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu