»   » ఆమె ఒప్పుకోలేదని ఆగిపోయిన అద్భుత యాక్షన్ మసాలా మూవీ..!!

ఆమె ఒప్పుకోలేదని ఆగిపోయిన అద్భుత యాక్షన్ మసాలా మూవీ..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

2008వ సంవత్సరంలో వచ్చిన సూపర్ హిట్ యాక్షన్ మూవీ 'వాంటెడ్'. ఏంజలీనా జోలీ ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లతో ఘనవిజయాన్ని సాధించింది. టింబూర్ బెక్మాంబిటోవ్ దర్శకత్వంలో వచ్చిన వాటెండ్ సినిమాను యూనివర్సల్ మూవీస్ వారు తెరకెక్కించారు. కాగా ఈ సినిమాకు సీక్వెల్ ను రూపొందించాలని దర్శకుడు ప్రయత్నించగా జోలీ ఇందుకు నో చెప్పిందట. దీనికి కారణం ఆమె గ్ర్యావిటీ అనే ఓ సైంటిఫిక్ సినిమాలో నటించాలనుకోవడమే. దీంతో డేట్లు సర్ధలేని పరిస్థితిలో ఆమె ఈ వాంటెడ్ సీక్వెల్ కు నో చెప్పిందట. దీంతో దర్శకనిర్మాలు జోలీ లేకుండా ఈ సినిమాను రూపొందించే సాహసం చెయ్యలేక సినిమానే ఆపేసారు.

ఇక ఏంజలీనా ప్రస్తుతం ది టూరిస్ట్ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో జానీ డెప్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే ఆమె గ్ర్యావిటీ సినిమా షూటింగులో పాల్గొననుంది. కాగా ఆమె నటించిన మరో యాక్షన్ థ్రిల్లర్ ది సాల్ట్ ఈ వేసవికి విడుదల కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu