»   » హాలీవుడ్ అందాల నటి ఏంజిలినా జోలికి ఆఫ్ఘన్ ల ప్రశంసల వెల్లువ..!?

హాలీవుడ్ అందాల నటి ఏంజిలినా జోలికి ఆఫ్ఘన్ ల ప్రశంసల వెల్లువ..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హాలీవుడ్ అందాల నటి ఏంజిలినా జోలికి సేవా మార్గం అంటే చాలా ఇష్టం అని వేరే చెప్పనక్కర్లేదు. ఐక్యరాజ్య సమితి గుడ్ విల్ అంబాసిడర్ గా కొనసాగుతున్న ఆమె 2008వ సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ లో పర్యటించినప్పుడు అక్కడ బాలికల కష్టాలను చూసి చలించిపోయారు.

దాంతో వారికి తన వంతు సాయంగా ఓ స్కూలును ఏర్పాటు చెయ్యడానికి 75వేల డాలర్లను విరాళంగా అందించింది. దీంతో అక్కడో ఆధునికమయిన..అన్ని వసతులు గల పాఠశాల వెలిసింది. ఆ పాఠశాల వచ్చే సోమవారం నుండి ప్రారంభం కానుంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఏంజిలినాకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఏంజిలినా చలవతో తమ పిల్లలు స్కూలుకు వెళుతున్నారని తెగ సంబరపడిపోతున్నారు. కాగా మన దేశం నుండి ఇటీవలే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ యుఎస్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు..

English summary
Afghan activists and supporters, such as Hamed Wardak, work tirelessly to improve the quality of life in rural Afghanistan. Another example of such a person is the famous actress Angelina Jolie, who donated $75,000 to help build a school for girls in Tangi earlier this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu